యువత క్రీడల్లో రాణించాలి

Jan 23, 2026 - 21:12
 0  0
యువత క్రీడల్లో రాణించాలి

  తిరుమలగిరి 24 జనవరి 2026 తెలంగాణ తెలంగాణ వార్త రిపోర్టర్:

యువతతోనే దేశం అభివృద్ధి జరుగుతుందని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు,పార్లమెంటు సభ్యులు డాక్టర్ కోవా లక్ష్మణ్ అన్నారు. ప్రధానమంత్రి సంసద్ క్రీడా మహోత్సవ సందర్భంగా శుక్రవారం తిరుమలగిరి మండల కేంద్రానికి ముఖ్యఅతిథిగా హాజరై క్రికెట్ క్రీడలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని ప్రతి వర్గానికి క్రీడలను చేరువ చేయాలన్నదే ప్రధాని మోదీ స్వప్నమని అన్నారు. యువతతోనే దేశం అభివృద్ధి జరుగుతుందని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకుల నైపుణ్యాలను వెలికి తీయడం కోసమే క్రీడలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. క్రీడలు ఆరోగ్యవంతమైన శక్తివంతమైన జీవన శైలికి కీలకంగా ఉంటాయని, ఇవి శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా మానసిక సమస్యలను తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో దోహదపడతాయి అన్నారు. క్రీడలు వ్యక్తిగత క్రమశిక్షణ, జట్టు కృషి, నాయకత్వం, విమర్శనాత్మక ఆలోచన నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు మంచి అవకాశాలను ఇస్తాయి అన్నారు. క్రీడా కార్యక్రమాలు వ్యక్తిత్వాన్ని నిర్మించి విద్య మరియు వృత్తిపరమైన విజయానికి దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు, సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్, తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి కడియం రామచంద్రయ్య, మండల నాయకులు ఎల్సోజు దీన్ దయాల్, మేడ బోయిన యాదగిరి, బంగారు రాజు, మేకల శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్లు, వేల్పుల శ్రీనివాస్ వేల్పుల శ్రీనివాస్, సంతోష్ నాయక్, సంతోష్ నాయక్, మరియు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి