గోపాల దిన్నెలో నీళ్ల కష్టాలు తీరేది ఎప్పుడు
ఎంతమంది ఎమ్మెల్యేలు,కలెక్టర్లు సర్పంచులు మారిన మా గ్రామ సమస్యను తీర్చలేక పోతున్నారు .
మా గ్రామ సెక్రెటరీ అసలే పట్టించుకోవడం లేదు .
సెక్రెటరీ పై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఫలితం లేదు అంటున్న గ్రామ ప్రజలు.
జోగులాంబ గద్వాల 10 జూన్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: ఇటిక్యాల. మండలం గోపాలదిన్నె గ్రామంలో 780 ఓటింగ్ ఉన్న గ్రామం ఆ చిన్న గ్రామం అయినప్పటికీ కొన్ని ఏళ్ల నుంచి నీల సమస్య ఉంది .అయితే ఎంత మంది ఎమ్మెల్యేలు,కలెక్టర్లు, సర్పంచులు మారినప్పటికీ మా గ్రామ సమస్యను ఎవరు తీర్చలేక పోతున్నారు. ఇప్పుడున్న గ్రామ సెక్రెటరీ పై కలెక్టర్ కి మే 5 తేదీన మా గ్రామానికి భూభారతి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే గ్రామ సెక్రెటరీ నీళ్లు విషయంలో అసలే పట్టించుకోవడం లేదు గ్రామంలో పనిచేయడం లేదు నీళ్ల గురించి అడిగితే అసలే సమాధానం చెప్పాడు వస్తవి అంటాడు,ఏ గ్రామంలో అయితే నీళ్లు సమస్య ఉందో సమస్యను తీర్చాలని పై అధికారులు సెక్రెటరీ కి చెబితే దాని విషయంలో ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మరొక్కసారి కలెక్టర్ కి విన్నపిస్తూ ఉన్నారు.మా గ్రామ నీటి సమస్యను తీర్చండి అంటూ ప్రజలు ఆవేదన చెందుతున్నారు.