మోత్కూర్ లో చోరీ

మోత్కూర్ తిరుమలగిరి 16 జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల పరిధిలోని కొండాపురం గ్రామంలో చోరి జరిగిన ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలోని మన్నె బుచ్చిరాములు ఇంట్లోకి చొరబడి బంగారం,వెండి ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సోమవారం బాధితుడి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం, గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి మూడు తులాల బంగారం, 15 తులల వెండిని ఎత్తికెళ్లారని పేర్కొన్నారు. సోమవారం చోరి జరిగిన విషయం గమనించిన బాధితుడు తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న మోత్కూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాల్లో పరిశీలనలు జరిపి విచారణ ప్రారంభించారు. దోషులను పట్టుకుని చోరి చేసిన వస్తువులను స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు ప్రొబేషనరీ ఎస్ఐ నోయల్ రాజ్ తెలిపారు.