ఫెర్టిలైజర్ షాప్ ను తనిఖీ చేసిన ఏ.డి.ఏ పద్మావతి

Jan 9, 2025 - 19:19
 0  48
ఫెర్టిలైజర్ షాప్ ను తనిఖీ చేసిన ఏ.డి.ఏ పద్మావతి
ఫెర్టిలైజర్ షాప్ ను తనిఖీ చేసిన ఏ.డి.ఏ పద్మావతి

అడ్డగూడూరు 9 జనవరి 2025 తెలంగాణవార్త తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వివిధ  గ్రామాల్లో ఫెర్టిలైజర్ షాపులను తనిఖీ నిర్వహించిన ఏ డి ఏ ఆలేరు పద్మావతి గురువారం రోజు రైతులకు వరి మందులు నాణ్యమైన మందులు అందించాలని అన్నారు. కల్తీ మందులు అని సమాచారం వస్తే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.అదేవిధంగా బొడ్డుగూడెం గ్రామంలో సమ్మెట మల్లయ్య అనే రైతు వరి పొలాన్ని సందర్శించారు.ఇప్పటివరకు మండలంలోని 5,100 ఎకరాలలో వరి నాటి అంచనా వేసినట్లు గుర్తించారు. రైతులతో మాట్లాడుతూ..ముదురు వురినారని వేసేటప్పుడు సమయంలో వరి కొసాలను తెంచి వేయడం వలన వరిలో కాండం తొలిచూ పురుగు ఉద్రతి అరికట్టవచ్చు,పిలకచేతం అధికంగా ఉంటుందని వరి నాటు వేసే సమయంలో యూరియా డిఏపిను దమ్ము చేసి సమయంలో వేసుకోవాలి అన్నారు.యూరియా ని ఒక్కసారి కాకుండా 3,4 సార్లు వేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎం ఏ ఓ పాండురంగ చారి, చౌల్లరామారం ఏవో అక్షర,జి దయాకర్,రైతులు మల్లయ్య, వెంకన్న,లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333