ఎస్పీ చేతులమీదుగా సహుద్యోగికి ఆర్థిక సహాయాన్ని అందించిన పోలీసులు 

Jul 15, 2025 - 19:44
 0  8
ఎస్పీ చేతులమీదుగా సహుద్యోగికి ఆర్థిక సహాయాన్ని అందించిన పోలీసులు 

జోగులాంబ గద్వాల 15 జూలై 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల జిల్లా ఎ.ఆర్ హెడ్‌క్వార్టర్స్‌ లో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది సమూహంగా తమ సహోద్యోగి రాజశేఖర్ కు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఇటీవల రాజశేఖర్ కి పుట్టిన శిశువు గర్భంలో ఉన్న ఉమ్మ  నీటిని ( వుంబ్ వాటర్) మింగిన కారణంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిన వెంటనే, ఎ.ఆర్ హెడ్క్వార్టర్స్ సిబ్బంది మనస్ఫూర్తిగా డబ్బు సేకరించారు.

 సేకరించిన 80,000 రూపాయలను ఈరోజు జరిగిన కార్యక్రమంలో  జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్ చేతుల మీదుగా రాజశేఖర్‌ కుటుంబ సభ్యులకు అందజేశారు.

 ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతు  సహుద్యోగి ఆపద సమయంలో అందరం కలిసి ఆదుకోవడం పోలీస్ కుటుంబ పరస్పర సహకారానికి అద్భుత ఉదాహరణ" అన్నారు.

 ఈ కార్యక్రమంలో ఏవో సతీష్ , ఆర్ఎస్ఐ విజయభాస్కర్  మరియు తోటి పోలీస్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333