మేము ,, సర్కారు దవఖానంకు వెళ్ళాం బాబోయ్.
ప్రభుత్వ హాస్పటల్ కు కాన్పు కోసం వస్తే కడుపుకోత.
జోగులాంబ గద్వాల 8 మే 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. జిల్లా మేము ప్రభుత్వ సర్కార్ దావకానకు వెళ్ళాము బాబోయ్ వెళ్ళాము మమ్ములను అక్కడ చంపేస్తారు. వివరాల్లోకి వెళ్తే జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పుల కోసం వస్తే కడుపుకోత మిగిల్చారు .
డాక్టర్లు నిర్లక్ష్యంతోనే తన బిడ్డ మృతి చెందిందని ఓ తండ్రి కన్నీరు మున్నేరుగా విలవించారు. సోమవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధితుడు వీరేష్ తెలిపిన వివరాల ప్రకారం గట్టు మండలం బోయలగుడం కు చెందిన సుజాతకు పురిటి నొప్పులు రాగా మూడో కాన్పు కోసం గట్టు మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అడ్మిట్ చేశారు. అక్కడ వైద్యుల సూచన మేరకు గత వారంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెను చేర్పించారు. అక్కడున్నటువంటి వైద్యులు పరీక్షించి డెలివరీ కావడానికి ఇంకా సమయం ఉన్నది అని చెప్పడంతో అనంతరం తిరిగి గట్టు పి హెచ్ సి వెళ్లారు. సోమవారం సాయంత్రం పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీ జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు . డాక్టర్లు పరీక్షించి స్కానింగ్ కోసం ఓ ప్రైవేట్ డయోగ్నస్టిక్ సెంటర్కు రెఫర్ చేశారు. స్కానింగ్ అనంతరం కాన్పు కోసం తేటర్ లోనికి రాత్రి 8 గంటల సమయంలో తీసుకెళ్లగా కొద్ది సేపటికి బాబు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించడంతో కుటుంభ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఇదంతా జరగడానికి గల కారణం డాక్టర్ల యొక్క లక్ష్యం వల్లే నా బిడ్డ మృతి చెందిందని వారి యొక్క తల్లిదండ్రులు కుటుంబీకులు ఆవేదన చెందుతూ కన్నీరు అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని చనిపోయిన ఆ బిడ్డను చూసి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లపై మండిపడ్డారు. అంత మాత్రమే కాకుండా హాస్పిటల్ యొక్క సూపర్డెంట్ ఎక్కడ ఉన్నాడు క్షణాల్లోనే ఇక్కడికి రావాలని చెప్పేసి మాట్లాడడంతో సూపర్డెంట్ అక్కడికి చేరుకోవడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ సూపర్డెంట్ విషయంలో నీవు ఈ హాస్పిటల్ లో ఒక సూపర్డెంట్ గా ఉన్నావు ఈ హాస్పిటల్ లో ఉన్నటువంటి వైద్యులు ఏ విధంగా మైనటువంటి రోగులకు వైద్యం చేస్తున్నారు అనేది తెలుసుకోవలసినటువంటి బాధ్యత నీకు ఉంది. ఇక్కడున్నటువంటి వైద్యులను పట్టించుకోకుండా మరి నీవేమీ ఒక ప్రైవేట్ హాస్పటల్ ను పెట్టుకొని నీవు అక్కడ వైద్యం చేస్తూ ఉంటే మరి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లకు ఎవరు చెప్పాలి .? ఎవరు వైద్యం చెయ్యాలా మీ ప్రైవేట్ హాస్పిటల్లో వేలకు వేలకు పైసలు ప్రజలతో తీసుకొని వైద్యం చేస్తారు. మరి ఇక్కడ జీతాలు ఇవ్వడం లేదా వేలకు వేలు జీతాలు తీసుకుంటూ రోగులకు మీరు ఎందుకు వైద్యం చేయడం లేదు? మారుమూల గ్రామాల నుండి అనేక రకమైనటువంటి రోగులు ఈ హాస్పిటల్ కి వస్తే వారికి సరైనటువంటి వైద్యము చేయకుండా చిన్న దానికి పెద్ద దానికి కర్నూలుకు పంపేయడం జరుగుతుంది మరి మీరు ఎందుకు వైద్యులుగా ఉన్నారు.? మీకు వైద్యం రాదా మరి వైద్యం రానప్పుడు ఎందుకు వైద్యం చేస్తున్నారు. మీ ప్రైవేట్ హాస్పిటల్ లో ఎందుకు మంచిగా చేస్తున్నారు .? ఇక్కడ ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు.? అంటే ఇక్కడ ఏమి చేసినా ఎవరు పట్టించుకోరు ఎవరు చనిపోయిన మీకు సంబంధం లేదు అన్నట్టుగా మీరు ప్రవర్తిస్తున్నారు.? దీనంతటి గల కారణం ఎవరు మిమ్మల్ని ప్రశ్నించకపోవడం వల్ల ఇలా జరుగుతున్నాయని మాకు వినిపిస్తున్నాయి.
దీని విషయంలో సూపర్డెంట్ పై డాక్టర్లపై మరి పై అధికారులకు చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడవలసి ఉంది.
వివరణ.
పై విషయంపై తెలంగాణ వార్త నుంచి చరవాణి ద్వారా గద్వాల జనరల్ హాస్పిటల్ సూపర్డెంట్ కు వివరణ గురించి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదు