చలో హైదరాబాద్ విజయవంతం చేయాలి ..... బచ్చల కూర స్వరాజ్యం
మునగాల 27 జూలై 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి :- గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 30న చలో హైదరాబాద్ కార్యక్రమం జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం గ్రామపంచాయతీ కార్మికులకు పిలుపునిచ్చారు.
శనివారం మండలంలోని నేలమరి గ్రామ పంచాయితీ కార్మికుల సమావేశం లో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం మాట్లాడుతు ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉద్యోగ భద్రత లేదని పాలకులు ఎందరో మారిన గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు తీరలేదని అన్నారు. జీవో నెంబర్ 51 ని సవరించి మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని. కారోబర్, బిల్ కలెక్టర్లను. సహాయ కార్యదర్శులు గా నియమించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న అర్హత కలిగిన ఇతర సిబ్బందులకు ఉద్యోగ భద్రత కల్పించి అందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరినారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులుమామిడి వెంకన్న, రాంపంగు సుందరయ్య, బచ్చలకూర నాగేంద్ర, పార్వతి, యంగలి పాపయ్య. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు