ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు""కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం

Mar 31, 2025 - 19:12
Mar 31, 2025 - 20:17
 0  3
ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు""కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం

తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ: ముస్లిం సోదర సోదరీమణులు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఎంతో పవిత్రమైన రంజాన్‌ పండుగ సందర్భంగా ముస్లిం సోదర,సోదరీమణులకు శుభాకాంక్షలు (ఈద్‌ ముబారక్‌) తెలిపారు.రంజాన్‌ పండుగ మత సామరస్యానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని చెప్పారు. అల్లాహ్‌ దీవెనలతో ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్‌ మాసం విశిష్టత అని పేర్కొన్నారు. క్రమశిక్షణతో ఉండడం, ఐకమత్యంతో మెలగడం,ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని తెలిపారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌ అని ఈ పండుగను ముస్లిం సోదర సోదరీమణులు సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State