ఫార్మసీ చట్టాలకి అనుగుణంగా మెడికల్ షాపులు నడపాలి

మునగాల 08 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి :- కోదాడ నియోజకవర్గంలో ఇటీవల కాలంలో ఫార్మసిస్ట్ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన ఆలేటి మహేష్ ఫార్మసిస్టుల ఉద్యోగ ఉపాధి అవకాశాల విస్తరణ మరియు ఫార్మసీ సట్టాల అమలు రిజిస్టర్ ఫార్మసిస్ట్ హక్కుల పరిరక్షణ కోసం ప్రజల ఆరోగ్యం రక్షణ అంశాలపై అనునిత్యం పోరాడుతానని మరియు సర్టిఫికెట్స్ లేకుండా మెడికల్ షాప్స్ నడిపే వారిని హెచ్చరించామని ఇకనైనా ఫార్మసీ చట్టాలకు అనుగుణంగా మెడికల్ షాపులు నడపవలసిందిగా సూచించామని పేర్కొన్నారు, మరియు ప్రతి మెడికల్ షాపు లో ఫార్మసిస్ట్ ఉండాలి అని లేని పక్షం లొ సంఘం తరుపున తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని మెడికల్ షాప్ యాజమాన్యానికి తెలియజేశామని తెలిపారు.