శాంతి భద్రతలకు భగ్నం కల్పిస్తే చర్యలు తప్పవు సీఐ రఘువీర్ రెడ్డి
పోలీసు అవగాహన సదస్సులో పలు సూచనలు....
డీజే లకు బాణసంచాలకు అనుమతి లేదు...
సుప్రీంకోర్టు నిబంధన ప్రకారమే ఉత్సవాలను నిర్వహించుకోవాలి...
ఎలాంటి అవాచనీయ సంఘటనలు జరిగిన చట్టపరమైన చర్యలు తప్పవు
సీఐ రఘువీర్ రెడ్డి...
భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు జరుపుకోవాలి ఎస్సై సురేష్.
తిరుమలగిరి 08 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- శాంతి, సామరస్యానికి మనం పాటుపడాలి,సోదరభావంతో అందరూ కలిసి మెలిసి ఉత్సవాలను జరుపుకోవాలని నాగారం సీఐ రఘువీర్ రెడ్డి తెలిపారు , ఆదివారం నాడు తిరుమలగిరి పోలీస్ ఆధ్వర్యంలో మున్సిపల్ కేంద్రంలోని వంగపల్లి నరసయ్య ఫంక్షన్ హాల్లో జరిగిన గణేష్ ఉత్సవాల నిర్వాణ కమిటీ సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలకు పటిష్ఠమైన పోలీసు భద్రత ఉంటుంది.ఉత్సవాలు భక్తి భావంతో జరుపుకోవాలని తెలిపారు మండపాల వద్ద కమిటీ సభ్యులు అందుబాటులో ఉండాలి. ఎలాంటి అవాచనీయ సంఘటనలు జరిగిన అనుమతి అర్జీదారులు, ఉత్సవకమిటీ సభ్యులే బాధ్యత వహించాలన్నారు మడపాల ఏర్పాటుకు నాణ్యమైన సామాగ్రి ఉపయోగించాలి, విద్యుత్ వైర్లు బాగుండాలి. మండపాలు రోడ్లపై ఏర్పాటు చేయవద్దు. ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దు.డీ జే లకు, బాణాసంచా కు అనుమతి లేదు.నిబంధనలు పాటించాలనీ తెలిపారు. సుప్రీంకోర్టు నిబంధన ప్రకారమే ఉత్సవాలను నిర్వహించుకోవాలని అన్నారు ప్రతిరోజు రాత్రి 10 గంటల వరకే గణేష్ మండపాల వద్ద పూజా , సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఎలాంటి అవాంఛ నియ సంఘటనలు జరగకుండా కార్యక్రమం నిర్వహించుకోవాలని సూచించారు మతసామరాస్యాన్ని రెచ్చగొట్టే విధంగా ఎవరు కూడా ప్రవర్తించరాదని చెప్పారు శాంతి భద్రతలకు బగ్నం కలిగిస్తే చట్ట పరమైన చర్య తీసుకుంటామన్నారు నిమజ్జనం రోజున ఉదయం వేళలో నిమజ్జనా కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో తిరుమలగిరి ఎస్సై సురేష్ పోలీసు సిబ్బంది వినాయక మండపాల నిర్వాహకులు ప్రజాప్రతినిధలు తదితరులు పాల్గొన్నారు