మున్సిపల్ చైర్మన్ రాజీనామా
తుంగతుర్తి :మర్చి18 తెలంగాణవార్త ప్రతినిధి:- సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ చైర్ పర్సన్ పోతరాజు రజని రాజశేఖర్ తన పదవితో పాటు 5వ వార్డ్ కౌన్సిలర్ పదవికి కూడా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను జిల్లా కలెక్టర్ కు పంపారు.మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ లపై బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అవిశ్వాసం కోరుతూ జిల్లా కలెక్టర్ కు వినతి సమర్పించి తీర్మానపత్రం అందజేసిన విషయం విధితమే. జిల్లా కలెక్టర్ ఈనెల 20వ తేదీన అవిశ్వాసం తేదీని ప్రకటించారు. ఈ తరుణంలో చైర్ పర్సన్ చైర్మన్ పదవికి కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయడం మున్సిపాలిటీలో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది... రాజకీయంగా ఎన్నో సమస్యల పట్ల ఒక మహిళగా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వాడవాడల సహాయ సహకారాలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవకై అంకితమై ఉన్నాను నేడు రాజీనామా చేసిన అనంతరం ఇకపై రాజకీయాల్లోనే ఉంటూ ప్రజల అవసరానికి ప్రజల కొరకై పోరాడుతా అని తెలిపారు