అనంతుల నరేందర్ సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమకం
తూముకుంట నరసారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు
తెలంగాణ వార్త కొండపాక:- కొండపాక ఏప్రిల్ 8 కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన అనంతుల నరేందర్ ను కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు. సోమవారం హైదరాబాదులోని ప్రజా భవన్ వద్ద టి పి సి సి ఆదేశానుసారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి నియామక పత్రాన్ని నరేందర్ కు అందజేశారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చడంతో పాటు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తన పై నమ్మకంతో జిల్లాకాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించిన , కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సా రెడ్డి కి సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలిపాడు.
ఈ కార్యక్రమంలో కొండపాక కుకునూర్ పల్లి మండల పార్టీ అధ్యక్షులు , వాసరి లింగారావు , విరుపాక శ్రీనివాస్ రెడ్డి . మార్కెట్ కమిటీ మాజీ వైస్ చెర్మన్ మంచాల చిన్న శ్రీనివాస్, మండలయువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బి.పర్శరాములు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మల్లికార్జున్ డి.మల్లేశం, కె.సాలయ్య , కోఆర్డినేటర్ చిరంజీవి,దుద్దెడ అధ్యక్షుడు అఖిల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.