మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం
మునగాల 28 ఏప్రిల్ 2024
తెలంగాణ వార్తా ప్రతినిధి :-
మండు వేసవి కాలంలో రోడ్డుపై వెళ్లే వాహనదారులు మరియు పాదాచారుల దాహార్తి తీర్చేందుకు మునగాల గ్రామ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని స్థానిక గణపవరం రోడ్డు నందు చలివేంద్రం ఏర్పాటు చేయటం జరిగిందని మునగాల గ్రామం మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు తాటికొండ సురేష్ తెలిపారు, ఆదివారం గ్రామానికి చెందిన మున్నూరు కాపు సంఘం సభ్యులతో కలిసి వారు చలివేంద్రాన్ని ప్రారంభించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునగాల మండల కేంద్రానికి ప్రధాన రహదారిగా ఉన్న గణపవరం ఫ్లై ఓవర్ అండర్పాస్ బ్రిడ్జ్ నందు చుట్టుపక్క గ్రామాల నుండి వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రానికి వచ్చే వారికి మంచినీటి దాహార్తిని తీర్చాలని సదుద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం సభ్యులు మునగాల గ్రామ మాజీ సర్పంచ్ కాసర్ల కోటేశ్వరరావు, శెట్టి గిరి, పరమాత్మల మధు, గంధం మహేష్, రాయల కృష్ణ, కాసర్ల శ్రీనివాస్, తూముల మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.