లౌకిక ప్రజాస్వామ్య శక్తులను గెలిపించండి..... బుర్రి శ్రీరాములు
మునగాల 28 ఏప్రిల్ 2024
తెలంగాణ వార్తా ప్రతినిధి :-
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉండి ప్రజా వ్యతిరేక విధానాలను ఆలంబిస్తూన్న మతతత్వ పార్టీ బిజెపిని ఓడించి లౌకిక ప్రజాస్వామ్య శక్తులను గెలిపించాలని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు బుర్రి శ్రీరాములు అన్నారు.
ఆది వారం మండలంలోని నేలమర్రి గ్రామం అమరవీరుల స్మారక భవనంలో సిపిఎం పార్టీ గ్రామ శాఖ సమావేశం బచ్చలకూర రాందాసు అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం10యేండ్లు కాలంలో రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను అవలంబిస్తూ రైతులకు వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలను తెచ్చిందని రైతులు 13 నెల పోరాటాల ఫలితంగా ఆ చట్టాలను వెనుకకు తీసుకుందని. రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుందని. ప్రజాస్వామ్యమని ఖూనీ చేస్తూ కోట్లాది రూపాయలు సంపన్నులకు రాయితీలుస్తూ ప్రజలపై అనేక భారాలను మోపుతుందన్నారు. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో మతతత్వ పార్టీ బిజెపిని ఓడించి లౌకిక ప్రజాస్వామ్య శక్తులను గెలిపించి అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చందా చంద్రయ్య, చివ్వేంల పార్టీ మండల కార్యదర్శి బచ్చలకూర రామ్ చరణ్, కార్యదర్శివర్గ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం మండవ వెంకటాద్రి, మామిడి గోపయ్య, గ్రామ శాఖ కన్వీనర్ బట్టుపల్లి ఉపేందర్, శాఖా కార్యదర్శులు జీడయ్య, కోటయ్య, సుధాకర్, సికిందర్, నరేష్, వెంకన్న, లింగయ్య, రమణయ్య రామాంజనేయులు గోపయ్య, సుందరయ్య తదితరులు పాల్గొన్నారు