మిర్యాల విద్యార్థుల పట్ల కరిగి కదులుతున్న దాతల హృదయాలు
నూతనకల్ ప్రకృతి సృష్టించిన బీభత్సంతో వచ్చిన అకాల వర్షాలకు పుస్తకాలు తడిసి పూర్తిగా పాడవడంతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల సమస్యలపై స్పందించిన గ్రామానికి చెందిన కాస శ్రీనివాస్ వారి స్నేహితుడు మెంచు సోమనసయ్య జ్ఞాపకార్థం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రాత పుస్తకాలు, పెన్సిళ్లు, పెన్నులు, మరోదాత దారం శ్రీనివాస్ నోట్స్ పుస్తకాలు విద్యార్థులకు సోమవారం అందజేసినారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు డి శివయ్య, ఉభయ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ లింగారెడ్డి, వాంకుడోత్ వెంకన్న నాయక్ లు మాట్లాడుతూ గ్రామంలోని ఆపదలో ఉన్న పాఠశాల విద్యార్థుల గురించి ఆలోచన చేసి విద్యార్థులకు విద్యాసామాగ్రిని అందజేసి విద్యాప్రగతినికాంక్షించడం చెప్పుకోదగిన విషయంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం సిద్ధిక్ పాష, అజయ్ కుమార్, చిలకమ్మ, మంగు, డోర్నెస్, నుశ్రతున్నిసా బేగం, అరుణ, సీతా రవి తదితరులు పాల్గొన్నారు.