మాయ మాటలతో మభ్యపెట్టిన బారా స ప్రభుత్వం

Feb 29, 2024 - 12:40
Mar 1, 2024 - 17:25
 0  5
మాయ మాటలతో మభ్యపెట్టిన బారా స ప్రభుత్వం

ప్లేటు ఫిరాయించడంలో తనకు తానే ది ట్ట అని రుజువు చేసుకున్నది.*   మాట తప్పిన ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించడం అంటే  ఆత్మహత్యతో సమానం. ఓటరులారా ఆలోచించండి!!!  ప్రాంతీయుడే ద్రోహం చేస్తే పాతిపెట్టాలన్న కాలోజీ మాట  నిజంచేయండి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని , ఆకాంక్షలను,  ఆత్మగౌరవాన్ని కాపాడుతూనే  దూరదృష్టితో స్పష్టమైన విజన్ తో పరిపాలించవలసిన అవసరం ఉండే.  అందుకోసం మేధావులు, బుద్ధి జీవులు, జర్నలిస్టులు, వివిధ పత్రికల ఎడిటర్లు,  మానవ హక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామిక వాదులతో  తొలిసారిగా సమావేశం నిర్వహించి తన విజన్ రూపొందించుకోకపోగా  త దనంతర కాలంలో ఈ వర్గాలను నిర్బంధించి అణచివేతకు గురిచేసి  ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినందున నేడు బారాస ప్రభుత్వము  ప్రజల ముందు దో షిగా నిలబడవలసివచ్చినది. . మౌలికంగా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలో కొనసాగి,  ప్రజల కొనుగోలు శక్తిని గణనీయంగా పెంచి , సంపదను ఉత్పత్తి చేసి , ప్రజాధనాన్ని ప్రజలందరికీ సమానంగా పంచవలసిన బాధ్యతను విస్మరించిన ప్రభుత్వం  పెట్టుబడిదారులకు వంత పాడి కొన్ని వర్గాలకే  సాయం చేసి  భూమిలేని వాళ్లను , కార్మికులను, వలస జీవులను, చిరు వ్యాపారులను,అసంఘటిత కార్మికులు,ప్రైవేటు ఉద్యోగుల నిర్లక్ష్యం చేసి  మానవాభివృద్ధికి తూట్లు పొడిచిన విషయం మనందరికీ తెలిసిందే . ఈ క్రమంలో  వివిధ సందర్భాల్లో బారాస ప్రభుత్వం ఇచ్చిన హామీలు తర్వాత ఏ రకంగా ప్లేట్ ఫిరాయించిందో ఒక్కసారి మనం పరిశీలించవలసిన అవసరం ఉన్నది .

తీయటి నినాదాలు,--  మాట తప్పిన హామీలు,

  దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి  తర్వాత కాలంలో వాళ్లు రాష్ట్రాన్ని పరిపాలించలేరని అవమానపరిచినాడు.
--  ఇంటికో ఉద్యోగం ఇస్తానని మాట ఇచ్చి  చట్టసభలోనే అలా మేము చెప్పనేలేదని  తప్పించుకునే ప్రయత్నం చేశారు.
-  కుర్చీ వేసుకుని  ప్రాజెక్టులు కట్టిస్తామని పొడు భూములకు పట్టాలిస్తామని మాట ఇచ్చి  ప్రాజెక్టును పూర్తి చేసింది లేదు. పోడు భూముల హక్కే కాదని  మాట మార్చినారు . కట్టిన ప్రాజెక్టులు కూడా మొత్తం అవినీతిలో కూరుకుపోయి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి.
--  అల్లుడు వస్తే ఏడ పడుకోవాలి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తా అని ప్రగల్బాలు పలికి  ఏళ్లు గడిచినా కట్టించకపోగా  తొందరెందుకు అని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు .కట్టినవి కోల్పోతున్నాయి.
-- దళితులకు మూడెకరాల భూమి పంచుతా అని  హామీ ఇచ్చి  భూములు ఉంటే కదా పంచేది అని  మాట మార్చి మోసం చేశాడు  .
--అందరికీ కేజీ టు పి జీ ఉత్సవిద్య అందిస్తానని మాట ఇచ్చి  ప్రైవేట్ రంగాన్ని పెంచి పోషించడమే కాదు  కులాల వారీగా రెసిడెన్షియల్ పాఠశాలలు కట్టి కులతత్వాన్ని పెంచి పోషించాడు.
--  రైతులందరికీ ఆదుకుంటామని చెప్పి  కౌలు రైతులు అసలు రైతులే కాదని  అవమానించాడు.  భూస్వాములకు,  పండించని భూములకు ,ఇండ్ల స్థలాలకు రైతుబంధు ఇచ్చి  పెట్టుబడిదారీ వర్గాలకు వంత పాడినారు .
- ఉద్యోగాల భర్తీకి జాబు క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి  10 ఏళ్ల తర్వాత హామీని విస్మరించి  నిరుద్యోగులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు .
- ఆడపిల్లల వైపు చూస్తే గుడ్లు పీకేస్తానని హెచ్చరించి
న ప్పటికి  రాష్ట్రవ్యాప్తంగా అనేక అకృత్యాలు అత్యాచారాలు అట్టడుగు వర్గాల పైన దాడులు  ప్రభుత్వం ఆపలేకపోయింది.
-  2018 ఎన్నికల మేనిఫెస్టోలో  నిరుద్యోగులకు 3o 16 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి  ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదని ఎగవేసింది  .
_తెలంగాణ వస్తే కాంట్రాక్టు అవుట్సోర్సు ఉద్యోగాలు ఉండవని హామీ ఇచ్చి  ప్రభుత్వమే కాంట్రాక్టు   పద్ధతిలో నియామకం చేసి  క్రమబద్ధీకరణ సాధ్యం కాదని తప్పించుకున్నది.
--  తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీ అని గొప్పగా చెప్పుకొని  దుష్ట రాజకీయాల ఊబిలో కూరుకుపోయిన తర్వాత  నేను అలా చెప్పలేదు మాది కూడా  పూర్తిగా రాజకీయ పార్టీ అని  మాట మార్చినాడు.
-  తెలంగాణ రాష్ట్ర సాధన సెంటిమెంటు పైన  ఉద్యమాన్ని నిర్మించి రాష్ట్రాన్ని సాధించిన తర్వాత  భారత రాష్ట్ర సమితి పేరుతో  తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికే తూట్లు పొడిచినారు.
--  సబ్బండ  వర్గాల, సకలజనుల సమ్మెతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే,  ప్రజా సంఘాలు మేధావులు  గత 50 ఏళ్లుగా పోరాటం చేస్తే  తెలంగాణ తెచ్చింది తాను మాత్రమేనని  ప్రకటించుకోవడం యావత్ రాష్ట్ర ప్రజలను  మోసం చేయడమే.
--  120o ఉద్యమకారులు  బలిదానాలకు పాల్పడితే  వాళ్ల కుటుంబాలను గౌరవించలేదు, గుర్తించలేదు, ఆదరించలేదు,  పరిపాలనలో భాగస్వాములను చేసుకోలేదు.  పైగా తన కుటుంబం మాత్రమే  బాగుపడింది అనే విమర్శను మూట కట్టుకున్నాడు.
---  గుట్టలు ప్రకృతి విధ్వంసాన్ని  సహించే ప్రసక్తి లేదన్న కేసీఆర్  పరిపాలనలో యదేచ్ఛగా గుట్టలు  కరిగిపోతున్నాయి  మాటలు నీటిమూట లుగా మిగిలిపోయినాయి. 
--,బంగారు తెలంగాణ చేస్తానని ప్రజల జీవితాలు బజారుపాలు చేసిండు.వాళ్ళ కుటుంబం మాత్రం బంగారమైపోయింది.
--  అధికారా నికివస్తే ప్రజాసేవలో గడుపుతాను అని తనకుటు o బానికి ఏ పదవులు వద్దనిభాసచేసి కావలికుక్కలావుంటానని మాటిచ్చి 0.5%లేనివాళ్ళ 
చేతిలో రాష్ట్రము o టే మాటలు చేతలకు పొంతనలేనట్లే. 
           పై హామీలన్నీ ఏ ప్రజలు కూడా కోరలేదు  కో రకుండానే హామీ ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను వంచించిన ప్రభుత్వాన్ని  ఈ ఎన్నికల్లో  తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధపడ్డారు.  అప్పులు 5లక్షలకొట్లకు పెరిగి , పేదరికం మరింత పెరిగిపోగా, నిరుద్యోగం  రాజ్యమేలుతూ,  ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది . ఈ పరిస్థితులకు  బాధ్యత వహించి తొలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదేళ్ల పాలనను,  వైఫల్యాన్ని అంగీకరించి  అధికారం నుండి తప్పుకోవడమే  శ్రేయస్కరం. లేకుంటే బలవంతంగా ప్రజలు  పరాజి తులను చేస్తారు .

--  వడ్డేపల్లి మల్లేశం
-( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ చౌటపల్లి జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333