ఎన్నికల ప్రచారంలో వింతలు ,విశేషాలు, భావోద్వేగాలు, బ్రతిమిలాటలు అధికార పార్టీ ఆగడాలు కూడా ఇందుకు కారణమేమో?
వికృత ప్రచార చేష్టలకు పరాకాష్ట గుండె పోటు మరణాలు.
మార్చుకోవాల్సిన ప్రచార సరళి.
ప్రజాస్వామిక విలువలు నేర్చుకోవాల్సిన పార్టీలు.
2023 తెలంగాణ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సుమారు గత 15 రోజులుగా హోరాహోరీగా సాగిన పోరాటం 28 నవంబర్ 2023 మంగళవారం ఐదు గంటలకు ముగిసిపోయింది . కానీ అనేక రకాల ప్రలోభాలు, వాగ్దానాలు , కక్షలు, కార్పన్యాలు, ఆవేదన పూరిత వేడుకోలు, చావో రేవో తేల్చుకుంటామని కొందరు అంటే గెలిపించకపోతే చావడమే మా ముందున్న కర్తవ్యం అని మరికొందరు ప్రజలకు నివేదించిన సందర్భాన్ని మనం గమనించవచ్చు . ఈ ఎన్నికల ప్రచారం సందర్భంగా వివిధ రకాల ప్రయత్నాలు ,చర్చలు, ఇంటర్వ్యూలు, మేధావులతో సమావేశాలు, ఎడిటర్లతో మంత్రుల సమావేశాలు, న్యూస్ ఛానల్ ఎం డి లతో ప్రధాన నాయకుల ఇంటర్వ్యూలు, ప్రముఖ కళాకారులు మేధావులతో క్వశ్చన్ అవర్ విద్యార్థులు ప్రజాస్వామ్యవాదులు ప్రజలను విద్యావంతులను ఆలోచింపచేసింది. అదే స్థాయిలో ఒక పార్టీ మరొక పార్టీ పైన విస్తృతస్థాయిలో దాడులకు అరాచకాలకు పాల్పడడం కొట్లాటలు హింస చెలరేగిన సందర్భాలను కూడా మనం చూడవచ్చు . రాష్ట్ర పరిపాలన యావత్తు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో కి వెళ్లిపోయినప్పటికీ ఈ మధ్యకాలంలో సుమారు 700 కోట్ల పైచిలుకు నగదు, ఇతరత్రా బంగారము ఆభరణాలు వస్తు రూపేనా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంటే నాయకుల వ్యక్తిత్వము, పార్టీ క్రమశిక్షణ, మ్యానిఫెస్టోలో పైన కాకుండా డబ్బు , మద్యం పైన ఎంతవరకు ఆధారపడి ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. టీవీ9 ఆధ్వర్యంలో దిమాక్రేట్స్ పేరుతో మేధావులతో జరిగిన చర్చా కార్యక్రమంలో కూడా అభ్యర్థుల గుణగణాలు సమర్థత ప్రతిభను చూస్తూనే స్థిరమైన ప్రభుత్వాన్ని ఇవ్వగల పార్టీని కూడా దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని ముగింపుకు రావడాన్నీ మనం గమనించవచ్చు. ఆ రకంగా చూసినప్పుడు గత తొమ్మిదిన్నర సంవత్సరాలకు పైగా బారాస ప్రభుత్వం రాష్ట్రాన్ని పరిపాలించినప్పటికీ స్థిరమైన ప్రభుత్వమని చెబుతున్నారే కానీ ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలను చేకూర్చని నిరంకుశ నియంతృత్వ ప్రభుత్వంగా బాసిల్లి న విషయాన్ని మనం అర్థం చేసుకొని అందుకు ప్రతిగా ఓటర్లు ఓటు వేయడానికి ప్రత్యామ్నాయ శక్తులను అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయవలసిన అవసరాన్ని ఈ ఎన్నికలు హెచ్చరిస్తున్నవి.అధికాపార్టే ప్రలోభాలు,దుర్వినియోగాన్ని ఖండిస్తోనే ప్రతిపక్షాలు ఎన్నికల సంస్కరణ దిశగా కృషిచేయవలసిన అవసరముంది.
కొన్ని సంఘటనలు -భావోద్వేగాలు:-
జగిత్యాల నియోజకవర్గం లో ప్రస్తుతం బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న భోగ శ్రావణి గతంలో స్థానిక శాసనసభ్యులు సంజయ్ కుమార్ చేతిలో మున్సిపల్ చైర్మన్ గా పనిచేస్తూ కూడా అనేక ఇబ్బందులకు గురైన విషయాన్ని గమనించినప్పుడు అనివార్యంగా ఆమె చైర్మన్ పదవికి రాజీనామా చేసి అధికార పార్టీ ఎమ్మెల్యే అకృత్యాన్ని అడ్డుకున్న తీరు అభినందనీయం . అదే స్ఫూర్తితో ఈనాడు బిజెపి టికెట్ ఇవ్వగా పద్మశాలి కుల బాంధవులు బిసి వర్గాలు మహిళా లోకం మద్దతి స్తున్న సందర్భంగా గెలుపుకు చేరువలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి . ఈ సందర్భంగా జగిత్యాలలో చివరి రోజున ప్రచారంలో ప్రసంగిస్తూ *నేను మీ ఆడబిడ్డను బతికించుకుంటారో చంపుకుంటారో మీ చేతుల్లోనే ఉంది . మీ ఓట్లను ఓడి బియ్యం మాదిరిగా అడుగుతున్నాను, ఆశీర్వదించండి .ఓడిపోతే నన్ను బ్రతకనివ్వరు . రాష్ట్రంలోనే ఆదర్శమైన నియోజకవర్గంగా తీర్చిదిడ్డుతా అంటూ వెడుకున్నతీరు ఆమె ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా స్థానిక అధికార పార్టీ నిరంకుశత్వాన్ని ఆగడాల కుఅద్దం పడుతున్నది.
ఇక ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి సంబంధించిన టిఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజు తనకు పార్టీ నుండి ఎలాంటి సహకారం అందలేదని ఆవేదన చెందుతూ కంటతడి పెట్టుకోవడం టిఆర్ఎస్ పార్టీలో కలకలం రేపినట్టు భావిస్తున్నారు. దగ్గరపడి చివరి రోజైనప్పటికీ పార్టీ నుండి ఆర్థిక సహకారం లేకపోవడమే కాక మధిర ఎన్నికల ఇన్చార్జి కూడా ప్రచారానికి రాకపోవడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే అభ్యర్థి మాత్రం ఆవేదన వెలిబుచ్చడం, తడిగుడ్డతో తన గొంతు కోశార o టూ కంటతడి పెట్టుకోవడాన్నీ గమనిస్తే అధికార పార్టీ యొక్కకొందరిపట్ల వివక్షతను మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక ఎన్నికల ప్రచారం సాదాసీదాగా జరగాల్సింది పోయి కోట్ల రూపాయల ఖర్చుతో కూడినటువంటి భారీ బహిరంగ సభలకు షెడ్లు టెంట్ల నిర్మాణంతో మామూలు పేదవాళ్లు మధ్యతరగతి వ్యక్తులు శాసనసభ్యులుగా పోటీలో ఉండడానికి ఆస్కారం లేని గడ్డు పరిస్థితులు తలెత్తినవి. ఈ పరిస్థితులలో ప్రచార సామాగ్రి తో పాటు డీజేలు ఇతర అన్ని రకాలైనటువంటి వనరులను భారీగా ఉపయోగించుకొని ఆడంబరంగా ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం లోని కొండమల్లేపల్లి మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ పక్షాన అభ్యర్థి రమావత్ రవీంద్ర కుమార్ ఎన్నికల ప్రచారానికి వస్తే 300 ఇస్తామని ఓ వార్డు సభ్యుడు చెబితే గుంటో జ్ ఆమృతమ్మ అనే కూ లీ ప్రచారాని కి వెళ్ళినట్లు ఆ క్రమంలో అక్కడ ఉపయోగించిన డీజే ఫోర్ పిన్ సౌండ్ తట్టుకోలేక గుండెపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలినట్లుగా వైద్యుడు దృవీకరించారు. అలాంటి డీజే లకు అవకాశం లేదని పోలీసులు అంటే రాజకీయ పార్టీల దురాగతం ఏ స్థాయికి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. 300 రూపాయల కోసం నిండు జీవితం బలిగా వడం నిజంగా ఆందోళనకరమే కదా,!
ఇక ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునే అవకాశాన్ని ఈసారి అధికార పార్టీ ప్రభుత్వ ఆదేశాల కనుసనల్లో జరిగిందని ప్రచారం జోరుగా సాగుతున్నది . విధులకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైనప్పటికీ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వకపోవడంతో ఓటు హక్కును వినియోగించుకోలేకపోయామని చాలా చోట్ల నిరసనకు దిగిన సందర్భాలను గమనించవచ్చు. ప్రశ్నిస్తే కానీ ఉద్యమ శక్తితో నిలదీసినప్పుడు ఎన్నికల సంఘం జోక్యం చేసుకుంటే ఎమ్మార్వోలు ఆర్డీవోలు అనుమతించినట్లుగా తెలుస్తుంటే ఇది ప్రభుత్వ అనుకూల విధానం కాదా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పటాన్ చెరువు నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న తీరును సీసీ కెమెరాల ద్వారా అధికారులు ఎవరికి ఓటు వేశారో గుర్తించారని తద్వారా తమ స్వేచ్ఛకు భంగం కలిగిందని ఆందోళనకు దిగిన సంఘటన జరిగింది. ఎటు చేసి ప్రభుత్వ మద్దతు కోసం అధికారులు కూడా ప్రయత్నించుతున్నటువంటి కుట్రను ఈ సంఘటన బయట పెడుతుంటే చివరికి ఉద్యమ ప్రభావంతో అక్కడ పనిచేస్తున్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ సీసీ కెమెరాల దిశను మార్చినట్లు పొరపాటు జరిగినట్లు అంగీకరించడంతో ఇక ఎన్నికలు , పోలింగ్ ముందే ఉన్న సందర్భంలో అధికారులు ఎన్ని అకృత్యాలకు పాల్పడతారో అధికార పార్టీ కోసం ఎన్ని అడ్డదారులు తొక్కుతారోనని ఉద్యోగులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు, ఓటర్లు ఆందోళన వ్యక్తం చేయడం కూడా ఎన్నికల్లో ప్రత్యేకతగా గమనించవచ్చు.
ఇప్పుడు హుజురాబాద్ నియోజకవర్గం లో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో కమలాపూర్ లో మాట్లాడుతూ తనను గెలిపిస్తే జై త్ర యాత్రకు వస్తానని ఓడిస్తే తన భార్య తను తన కూతురు ముగ్గురం ఉరేసుకుంటామని డిసెంబర్ 4వ తేదీన తమయాత్రకు ప్రజలు రావాలని దండం పెడుతూ ప్రజల కడుపులో తలపెడుతున్నానని ప్రాధేయపడడాన్ని గమనించినప్పుడు అధికార పార్టీ సభ్యులు ఎంతకు దిగజారినారో అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛాయుతంగా జరగవలసిన ఎన్నికలను భయకంపిత వాతావరణంలోకి నెట్టిన గత పదిఏళ్ల పాలనను, ఎన్నికల సంఘం యొక్క ఉదాసీనతను ప్రశ్నించవలసిన అవసరం చాలా ఉన్నది .
---వడ్డేపల్లి మల్లేశం
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమనేత హుస్నాబాద్ (చౌ టపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రo)