-మానవాళి మనుగడకు చెట్లు చాలా అవసరం 

- రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.

Jul 15, 2024 - 21:00
Jul 16, 2024 - 00:11
 0  7

చెట్లను మనం కాపాడితే చెట్లు మనల్ని కాపాడుతాయి

ప్రతిఒక్కరూ మొక్కలను నాటాలి 

పర్యాటకులను ఆకర్షించే విధంగా ఏకో టూరిజం డెవలప్మెంట్ 

రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.

వన మహోత్సవం లక్ష్యాలను 100 శాతం పూర్తి చేయాలి. 

వన మహోత్సవంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి. 

అడవి ఆకలి తీర్చే కేంద్రగారం.

వనమహోత్సవం కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 13 లక్షల 45 వేల  మొక్కలు నాటే లక్ష్యం నిర్ణయించారని, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ప్రజలను భాగస్వామ్యులను చేసి లక్ష్యాన్ని సాధించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు.

సోమవారం  ములుగు మండలం లోని   ఇంచర్ల ఎర్ర గట్టమ్మ వద్ద 63 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న గట్టమ్మ ఏకో పార్క్ లో  రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క  75 వ వన మహోత్సవం కార్యక్రమములో భాగంగా  జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్ పి షభరిష్,  సీసీఏఫ్ ప్రభాకర్ ఐ ఎఫ్ ఎస్ లతో కలిసి మొక్కలను  నాటారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 75 వ వన మహోత్సవం కార్యక్రమంలో అందరం మన వంతుగా ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని, ప్రభుత్వ ఖాళీ స్థలాలలో అధికారులు ప్రజాప్రనిధులు కలిసి చెట్లు నాటే కార్యక్రమాలను దిగ్విజయం చేయాలని అన్నారు.

వన మహోత్సవంలో విరివిరిగా మొక్కలు నాటి పూర్తిస్థాయిలో లక్ష్యాన్ని సాధించాలని అధికారులకు సూచించారు. నాటిన మొక్కలకు ట్రీ గార్డ్ ఏర్పాటు చేసి రక్షణ చర్యలు తీసుకోని  మొక్కలను సంరక్షించాలని పేర్కొన్నారు. ప్రజల కోసం ఇంచర్ల గ్రామ సమీపంలోని ఎర్ర గట్టమ్మ వద్ద అర్బన్ పార్క్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అడవి చాలామందికి ఆకలి తీర్చే ఆదాయ కేంద్రమని ఆన్నారు. సగటు మానవ జీవితం అటవీ పై ఆధారపడుతుందని , పిల్లల మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంతటి స్వచ్ఛమైన ఆహారాన్ని అటవీ నుంచి పొందవచ్చని తెలిపారు. మానవ సమాజం అటవీ ప్రాంతాలలో జీవనం కొనసాగించి నాగరికత వైపు అడుగులు వేసిందని, అడవులను కాపాడుకోవడం ద్వారా మానవాళి మనుగడను అనేక సంవత్సరాలు పెంపొందించుకోవచ్చని అన్నారు.

కొన్ని దశాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో ఎంత అటవీ ప్రాంతం ఉంది వాటి ద్వారా స్థానిక ప్రజలు ఎలాంటి ప్రయోజనాలు పొందారు అనే అంశాలపై అక్కడి నివసించే వృద్ధులతో వివరాలు సేకరించి కథల రూపంలో పాఠశాల విద్యార్థులకు అందిస్తే వారికి అడవుల వల్ల ఇలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో సులభంగా అర్థమవుతుందని ఇలాంటి నూతన ప్రణాళికలను రూపొందించాలని అటవీ శాఖ అధికారులకు సూచించారు.

మొక్కతో - మొక్కులు చెల్లిస్తాం  " అనే నూతన విధానాన్ని అమలు తీసుకురావాలని ముఖ్యంగా మేడారం ప్రాంతంలో వనదేవత దర్శనం కోసం అనేకమంది భక్తులు వస్తున్నారని కానీ అటవీ ప్రాంతంలో కొలువైన వనదేవతలుగా ప్రసిద్ధి చెందిన ఇక్కడి ప్రాంతం మాత్రం అటవీ విస్తీర్ణాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులతో"  మొక్కతో మొక్కులు చెల్లిస్తాం అంటూ వారితో మొక్కలు నాటించే ప్రయత్నం చేయాలని తెలిపారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మా చిన్నతనంలో వన మహోత్సవం గురించి పుస్తకాలలో ప్రత్యేకంగా చదువుకున్నామని కానీ నేడు  ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న వనమోత్సవం కార్యక్రమంలో భాగస్వాములు అవడం చాలా సంతోషంగా ఉందని కలెక్టర్ తెలిపారు. ములుగు జిల్లా ఎక్కువ అటవీ విస్తీర్ణం కలిగి ఉందని,   జిల్లాలో వనదేవతలు కొలువై ఉన్నారని   పేర్కొన్నారు. జిల్లా లో అన్ని వసతులతో కూడిన అద్భుతమైన పార్కును రూపొందించాలని అటవీ శాఖ అధికారులను కోరారు.
ముఖ్యంగా విద్యార్థులు  పాఠశాల స్థాయిలోనే సామాజిక విలువలు, అడవుల వల్ల కలిగే లాభాలు, ఉపయోగాలు గురించి తెలుసుకోవాలని అన్నారు.

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ సంవత్సరంలో వేసవికాలంలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదయాయని , ఉష్ణోగ్రతలు తగ్గించడానికి అడువుల  పెంపకం ఒకటే మార్గమని ప్రతి ఒక్కరు అడవుల సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలని, మొక్కలను పెంచడంతో పాటు  సంరక్షణ కూడా చూసుకోవాలని అన్నారు.

సీసీఏఫ్ ప్రభాకర్ ఐ ఎఫ్ ఎస్  మాట్లాడుతూ అడవుల శాతాన్ని పెంచడమే లక్ష్యంగా వన మహోత్సవం  కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని అడవులను నరికిన, ఆక్రమించడానికి ప్రయత్నించిన కఠిన చర్యలు తప్పవని ప్రతి ఒక్కరూ బాధ్యతగా అడవుల సంరక్షణకు పాటుపడాలని కోరారు.

అనంతరం జిల్లాలో వనమహోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాస రచన పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు  ప్రశంసాపత్రాలను, 
షిల్డ్ లను మంత్రి అందచేశారు. 

ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి మహేష్ బి గీతే, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ,  డిఎఫ్.ఓ రాహుల్ కిషన్ జాదవ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333