మాజీ సర్పంచులు అరెస్ట్

Dec 29, 2025 - 22:47
 0  339
మాజీ సర్పంచులు అరెస్ట్

  తిరుమలగిరి 30 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని మాజీ సర్పంచుల ఆందోళన కొనసాగుతుంది శాసనసభ సమావేశంలో తమ సమస్యల పరిష్కరించాలని మాజీ సర్పంచ్ ల సంఘ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ వెళుతున్న తిరుమలగిరి మండలంలోని వివిధ గ్రామాల మాజీ సర్పంచులను  పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు ఈ సందర్భంగా మాజీ సర్పంచులు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి చెందాలని లక్ష్యంతో సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేశామన్నారు న్యాయబద్ధంగా తమకు రావలసిన బిల్లులు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తు అక్రమ అరెస్టులు చేయడం తగదని ధ్వజమెత్తారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి