మాజీ మంత్రి కేటీఆర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన శివ యాదవ్
హైదరాబాద్: 02 జనవరి 2025 గురువారం తెలంగాణ వార్త రిపోర్టర్:-తెలంగాణ భవన్లో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మరియు తెలంగాణ సేవాదళం రాష్ట్ర ఉపాధ్యక్షులు శివ యాదవ్ తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్&మాజీ మంత్రి తారకరామారావును మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా జనవరి 12న కరణ్ భాగ్ మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవానికి రావలసిందిగా కేటీఆర్ ను ఆహ్వానించడం జరిగిందని శివ యాదవ్ తెలిపారు.