మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి""ఘనంగా నేలకొండపల్లి

తెలంగాణ వార్త ప్రతినిధి నేలకొండపల్లి : నేలకొండపల్లి మండల కేంద్రం లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ భారతదేశాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. సాంకేతిక విప్లవం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా పునాదులు వేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన అడుగు జాడల్లో మనందరం నడవలన్నారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొడ్డు బొందయ్య,వంగవీటి నాగేశ్వరరావు,కుక్కల హనుమంతరావు, జెర్రిపోతుల సత్యనారాయణ,మామిడి వెంకన్న,దోసపాటి శేఖర్, రెడ్డిమళ్ల బాబురెడ్డి,మైసా శంకర్,మోర మల్లయ్య,గుండా బ్రహ్మ్మం,చిట్టెంచెట్టి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు