సూట్ కేసులో బాలిక మృతదేహం  

May 21, 2025 - 19:24
 0  3
సూట్ కేసులో బాలిక మృతదేహం  

హైదరాబాద్:మే21: బెంగళూరు నగర శివార్లలో బుధవారం అత్యంత దారుణమైన సంఘటన ఒకటి వెలుగు చూసింది. సుమారు పదేళ్ల వయసున్న ఒక బాలిక మృతదేహం సూట్‌కేసులో లభ్యం కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ అమానవీయ ఘటన బెంగళూరు వాసులను ఉలిక్కిపడేలా చేసింది.

వివరాల్లోకి వెళితే, అనేకల్ తాలూకా పరిధిలోని చందాపుర ప్రాంతంలో రైల్వే ట్రాక్ సమీపంలో ఈ సూట్‌కేసును కొందరు స్థానికులు గుర్తించారు. అనుమానాస్పదంగా ఉన్న ఆ సూట్‌కేసును చూసి వారు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. 

దీంతో, ఆ ప్రాంత పరిధిలోని సూర్యానగర్ పోలీస్ స్టేషన్ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారం భించారు. సూట్‌కేసును తెరిచి చూడగా, అందులో చిన్నారి మృతదేహం ఉండటంతో వారు నివ్వెరపోయారు.

బాలికను వేరొక చోట హత్య చేసి, ఆపై మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి, ప్రయాణిస్తున్న రైలు నుంచి ఇక్కడ విసిరేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమా నిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. 

ఈ దారుణానికి పాల్పడిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని, అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మ రం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333