మాజీ ఎంపీ మంద జగన్నాథం ని పరామర్శించిన తెలంగాణ మంత్రుల బృందం..
జోగులాంబ గద్వాల 30 డిసెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో గుండె సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ మాజీ పార్లమెంట్ సభ్యులు మంద జగన్నాథం ని పరామర్శించిన మంత్రివర్యలు సీతక్క ,పొన్న ప్రభాకర్ ,వివేక్ .అనంతరం డాక్టర్లతో మాట్లాడి వారి ఆరోగ్యంపై ఆరా తిశారు. మంద జగన్నాథం కి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. అదేవిధంగా మంద జగన్నాథం కుటుంబ సభ్యులకు మనోదైర్యాన్ని తెలియజేశారు.