మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు రాయితీ రుణాలు మంజూరు:జిల్లా కలెక్టర్

Jul 26, 2024 - 21:32
Jul 26, 2024 - 21:33
 0  3
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు రాయితీ రుణాలు మంజూరు:జిల్లా కలెక్టర్
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు రాయితీ రుణాలు మంజూరు:జిల్లా కలెక్టర్

జోగులాంబ గద్వాల 26 జూలై 2024 తెలంగాణ వార్త ప్రతినిధి. గద్వాల:-మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా లక్ష్యం మేరకు రుణాలు అందే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ సూచించారు.శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా, మండల మహిళ సమాఖ్య సభ్యులు, సంబంధిత సంక్షేమ శాఖల అధికారులు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళా శక్తి పథకం క్రింద జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు రాయితీ రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.

  రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకోవడానికి 6675 యూనిట్లకు రూ. 54.04 కోట్ల రుణాలు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నారు.  ముఖ్యంగా స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్ యూనిట్స్, మీ-సేవ కేంద్రాలు, మహిళా శక్తి క్యాంటీన్లు, ఈవెంట్ మేనేజ్మెంట్, పౌల్ట్రీ, ఫిష్ యూనిట్స్, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ రంగంలో కస్టమర్ హైర్ సెంటర్ ద్వారా ట్రాక్టర్లతో పాటు ఇతర వ్యవసాయ ఉపకరణాలు రైతులకు అద్దెకు అందించే విధంగా యూనిట్ లను గ్రౌండ్ చేయాలన్నారు.  లబ్ధిదారుల ఎంపికను సంబంధిత శాఖల అధికారులు పారదర్శకంగా నిర్వహించి పూర్తి చేయాలని సూచించారు.  ఎంపికైన లబ్ధిదారుల జాబితాను వెంటనే బ్యాంకర్లకు పంపి, బ్యాంకుల ద్వారా రుణాలు వెంటనే మంజూరయ్యేలా చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు.  ఇట్టి లక్ష్యాలను సాధించేందుకు ఏపీఎంలు, డీపీఎంలు పూర్తి బాధ్యతతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆదేశించారు. 

    ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మరియు డి ఆర్ డి ఓ నర్సింగ రావు, ఎల్ డి ఎం అయ్యపు రెడ్డి, అడిషనల్ డిఆర్డిఓ నరసింహులు, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్లు విలాస్ రావు, రామ్మూర్తి, ఏపీఎం లు, డిపిఎం లు, వివిధ శాఖల బ్యాంకు మేనేజర్లు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు...

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State