మరిపెడలో సిఐటియు జిల్లా మహాసభలు జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్

మరిపెడ 28 జూలై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–
మరిపెడ మండల కేంద్రంలో సిఐటియు జిల్లా మహాసభ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ కనకదుర్గ ఫంక్షన్ హాల్ లో సోమవారం రోజు నిర్వహించారు.2018లో ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు సక్రమంగా పనిచేయకపోవడం వలన అంగన్వాడీ టీచర్లు ఇబ్బంది పడుతున్నారని తక్షణమే ట్యాబ్ లు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ డిమాండ్ చేశారు.తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ప్రాజెక్టు కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉపేందర్ మాట్లాడుతూ ఫోన్ లు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల అంగన్వాడీ టీచర్లతో పాటు లబ్దిదారులు పలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనాలు 26 వేలు ఇవ్వాలని, ఐసిడిఎస్ పరిరక్షణకై పోరాటాలు ఉదృతం చేస్తామని తెలిపారు. కార్మిక హక్కుల పరిరక్షణకై ధ్యేయంగా పోరాడుతున్న సీఐటీయూ జిల్లా మహాసభలు అక్టోబర్ లో మరిపెడ కేంద్రంలో జరుగనున్నాయని, కార్మిక వర్గం సహకరించి జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏసుమళ్ళ సంపూర్ణ, ప్రాజెక్టు కార్యదర్శి సమ్మెట లలిత, వివిధ సెక్టార్ లీడర్లు జ్యోతి, రమ, కళమ్మ, విజయకుమారి, కవిత, మంగమ్మ, రజిత, ఉమ, చంద్రకళ, నీరజా తదితరులు పాల్గొన్నారు.