మద్యం, మనీ ,గుండా గిరి దందా రాజకీయాలకు చర మ గీతం పాడాలి

Sep 25, 2024 - 17:02
 0  3
మద్యం, మనీ ,గుండా గిరి దందా రాజకీయాలకు చర మ గీతం పాడాలి
మద్యం, మనీ ,గుండా గిరి దందా రాజకీయాలకు చర మ గీతం పాడాలి
మద్యం, మనీ ,గుండా గిరి దందా రాజకీయాలకు చర మ గీతం పాడాలి

కొత్తతరం రాజకీయ నాయకత్వం ఎదగాలి. ధర్మార్జున్  నేడు రాజకీయాల్లో కొనసాగుతున్న మద్యం, మని, గుండా గిరి దందా రాజకీయాలకు చర మ గీతం పాడాలని తెలంగాణ జనసమిథి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి  ధర్మార్జున్ పిలుపునిచ్చారు. ఈరోజు నేమ్మికల్ లోజరిగిన తెలంగాణ జన సమితి ఆత్మకుర్ మండల  పార్టీ ప్లీనరీ లో  ముఖ్య అతిథిగా పాల్గొని మా ట్లాడుతూ ప్రజలు కేంద్రంగా ప్రజల కోసం పని చెసే కొత్త తరం రాజకీయ నాయకత్వాన్ని తయారుచేసి పారదర్శకత్వం కూడుకున్న ప్రజాస్వాంక సంస్కృతిని సామాజిక న్యాయాన్ని సాధించడమే తమ లక్ష్యమని  ధర్మార్జున్ తెలిపారు. తాను నియోజకవర్గంలో సేంద్రీయ వ్యవసాయం లాంటి ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య రాజకీయాల కొరకు గ్రామాలలో విద్యావంతులైన తటస్తులైన కొత్త తరాన్ని ప్రోత్సహిస్తు జనసమితి పార్టీ నీ బలోపేతం చేస్తున్నామ ని తెలిపారు.  ఇది కొంతమందికి జీర్ణం కాకపోవచ్చు.ఇది కొంతమందికి అర్థం కాకపోవచ్చు నదురాయకపోవచ్చు కానీ దీర్ఘ కాలిక లక్ష్యంతో తాను నియోజకవర్గంలో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు .స్వర్గీయ జయశంకర్ సార్ అందించిన సైదాంతిక స్ఫూర్తి తో పాటు ప్రజాస్వామ్య రాజకీయాల  కొరకు పోరాడి న విప్లవ ప్రజాస్వామిక ఉద్యమకారులని ఆదర్శంగా తీసుకొని తాము ముందుకు సాగుతామని ఆయన అన్నారు.. మారాల్సింది పాలకులు మాత్రమే కాదని పాలన రాజకీయ విధానాలని ఆ వైపుగా ప్రజలను సమాయత్తం చేయుట కొరకు తెలంగాణ ఉద్యమ నేత కోదండరాం గారు చేపట్టిన ఈ మహా యజ్ఞంలో దీర్ఘకాలి క యుద్ధంలో ప్రతి కార్యకర్త సైనికు డి లా పోరాడాలని ఆయన కోరారు. మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గట్ల రమాశంకర్ యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్ జిల్లా పార్టీ కార్యదర్శి బొడ్డు శంకర్ లీగల్సెల్ జిల్లా కన్వీనర్ కుంచం చంద్రకాంత్ కో కన్వీనర్ వీరేష్ నాయక్ విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షులు బొమ్మగాని వినయ్ గౌడ్ మండల పార్టీ కోఆర్డినేటర్ జాతోత్ శ్రీనివాస్ రైతు సమితి నాయకులు పండు రాములు గౌడ్ సామ శ్రీనివాస్ రెడ్డి తగుల జనార్ధన్  వర్రె సైదులు యాదవ్, ముద్దం జాన్ రెడ్డి ,పుప్పాల సాయి, శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు. తదనంతరం ప్లీనరీ కొన్ని తీర్మానం ఆమోదించడం జరిగింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333