ఆకలి తీర్చే అన్నదాతలకు..ఆర్థిక ధైర్యం ఇచ్చే ప్రజాపాలన
రైతు భరోసా సంబరాలలో సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్నికి క్షీరాభిషేకం చేసిన...
గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు..
జోగులాంబ 24 జూన్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వైఎస్ఆర్ చౌక్ నందు రైతు భరోసా సంబరాలలో భాగంగా జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ ఆదేశానుసారం గద్వాల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ లత్తిపురం వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి సిఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ మంత్రివర్యులు,ఇంచార్జీ సరితమ్మ చిత్రపటాన్నికి క్షీరాభిషేకం చేసి రైతుల పక్షణ ప్రజా ప్రభుత్వాన్నికి కృతజ్ఞతలు తెలియజేశారు.. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఆకలి తీర్చే అన్నదాతలకు..ఆర్థిక ధైర్యం ఇచ్చే ప్రజాపాలన...దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వం కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్లు రైతు భరోసా డబ్బులు రైతులకు అందజేసిన ఏకైక ప్రభుత్వం మన రేవంతన్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డిసారధ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు క్యాబినెట్ మంత్రులతో కలిసి రైతాంగానికి భరోసా ఇచ్చారన్నారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఇసాక్, గోనుపాడు శ్రీనివాస్ గౌడ్,పెద్దపల్లి అల్వాల రాజశేఖర్ రెడ్డి,డిటిడిసి నర్సింహులు, భాస్కర్ యాదవ్, పాతపాలెం ఆనంద్ గౌడ్, కౌసర్ బేగ్, పటేల్ శ్రీనివాసులు, కరాటే సత్యం, కుమ్మరి నారాయణ, ఆంజనేయులు, కృష్ణయ్య గౌడ్,శ్రీనివాస్ రెడ్డి, రంగస్వామి,మోహిన్,అయ్యప్ప,మద్దిలేట్టి,ఆంజనేయులు,భాస్కర్,లక్ష్మణ తదితరులు ఉన్నారు