మత స్వేచ్ఛ భారత రాజ్యాంగం ద్వారా భారత పౌరుడికి ఉండే ఒక ప్రాథమిక హక్కు

May 21, 2025 - 19:07
 0  2
మత స్వేచ్ఛ భారత రాజ్యాంగం ద్వారా భారత పౌరుడికి ఉండే ఒక ప్రాథమిక హక్కు
మత స్వేచ్ఛ భారత రాజ్యాంగం ద్వారా భారత పౌరుడికి ఉండే ఒక ప్రాథమిక హక్కు

                      బిషప్ దుర్గం ప్రభాకర్
         తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ నాయకులు
                      రెవ.జాన్ బెన్ని లింగం
              ఏ. ఐ. సి. సి. జాతీయ అధ్యక్షులు
                      రెవ. డా. గడ్డం డేవిడ్ రాజు
       సూర్యాపేట జిల్లా పాస్టర్స్ పెలోషిఫ్ అధ్యక్షులు

మంగళవారం 20 మే: ఆత్మకూర్ (యస్)  మండల కేంద్రం లోని పాతర్లపహాడ్ గ్రామం లోని బేతెస్థ ప్రార్ధన మందిరం (డబ్ల్యూ. యం. ఇ) చర్చ్ నందు ఆత్మకూర్ యస్ మండల అధ్యక్షులు రెవ. డా. గుంటూరు శాంతాయ్య,  సూర్యాపేట నియోజకవర్గ పాస్టర్స్ పెలోషిప్ అధ్యక్షులు రెవ. డా. జలగం జేమ్స్ ఆధ్వర్యంలో క్రైస్తవ హక్కుల అవగాహనా సదస్సు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంనకు ముఖ్య అతిధులుగా రెవ. జాన్ బెన్ని లింగం ఏ. ఐ. సి. సి. జాతీయ అధ్యక్షులు, బిషప్ దుర్గం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ నాయకులు పాల్గొని మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం మత స్వేచ్ఛ హక్కు (Right to Freedom of Religion) అనేది ప్రతి ఒక్కరూ తమ మతాన్ని స్వేచ్ఛగా అనుసరించడానికి, ఆచరించడానికి, ప్రచారం చేయడానికి హక్కు కల్పించే ప్రాథమిక హక్కు.ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 25-28 ద్వారా రక్షించబడుతుందనీ.మత స్వేచ్ఛ హక్కు యొక్క అంశాలు మనస్సాక్షి స్వేచ్ఛ (Freedom of Conscience) ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతాన్ని అనుసరించడానికి లేదా అనుసరించకపోవడానికి హక్కు కలిగి ఉంది మతాన్ని ప్రకటించే, ఆచరించే మరియు ప్రచారం చేసే హక్కు మతాలను బహిరంగంగా ప్రకటించడానికి,ఆచరించడానికి మరియు ప్రచారం చేయడానికి హక్కు ఉంది మత సంస్థలను నిర్వహించే హక్కు ప్రతి మతం తన స్వంత మత సంస్థలను స్థాపించవచ్చు ననీ, నిర్వహించుకోవచ్చు ప్రభుత్వ జోక్యం లేకపోవటం మతం లేదా మతపరమైన నమ్మకాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేయకూడదు ప్రజా క్రమం,నైతికత మరియు ఆరోగ్యం ఈ హక్కులు ప్రజా క్రమం,నైతికత మరియు ఆరోగ్యానికి లోబడి ఉంటాయి వివక్ష లేకపోవుట మతం ఆధారంగా ఎవరూ వివక్షకు గురికాకూడదు మత స్వేచ్ఛ హక్కు యొక్క పరిమితులు కొన్ని సందర్భాల్లో మత స్వేచ్ఛ హక్కుకు పరిమితులు విధించబడవచ్చు ఉదాహరణకు, మతం పేరుతో ప్రజల హక్కులకు భంగం కలిగించకూడదు లేదా సామాజిక క్రమానికి విరుద్ధంగా వ్యవహరించకూడదు మత స్వేచ్ఛ హక్కు యొక్క ప్రాముఖ్యత సమాజంలో వైవిధ్యం మత స్వేచ్ఛ హక్కు ప్రజలందరూ తమకు నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛను కల్పిస్తుందనీ,ఇది సమాజంలో వైవిధ్యం మరియు సహనం నెలకొల్పడానికి దోహదపడుతుంది ప్రజాస్వామ్య విలువలు మత స్వేచ్ఛ హక్కు ప్రజాస్వామ్యానికి ఒక ముఖ్యమైన అంశం, ఎందుకంటే ఇది ప్రజలకు వారి నమ్మకాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే హక్కును కల్పిస్తుంది.ప్రాథమిక హక్కు మత స్వేచ్ఛ హక్కు భారత రాజ్యాంగం ద్వారా రక్షించబడిన ప్రాథమిక హక్కు, అంటే ఇది ఒక పౌరుడికి ఉండే ఒక ప్రాథమిక హక్కు.ఈ కార్యక్రమంలో రెవ. డా. గడ్డం డేవిడ్ రాజు,కోదాడ నియోజకవర్గ పాస్టర్స్ పెలోషిఫ్ అధ్యక్షులు రెవ. డా. వి. యెషయా,హుజూర్నగర్ పాస్టర్స్ పెలోషిప్ అధ్యక్షులు రెవ. మీసా దేవసహాయం, హుజూర్నగర్ నియోజకవర్గ చైర్మన్ రెవ.తలకప్పాల దయాకర్,రెవ.ఏర్పుల క్రిస్టోఫర్, రెవ. పంది మార్క్, ఈ. రాజేష్, యం సుందర్ రావు తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333