నేడు శ్రీ తిమ్మప్ప స్వామి కళ్యాణం

May 23, 2024 - 18:57
 0  7
నేడు శ్రీ తిమ్మప్ప స్వామి కళ్యాణం

జోగులాంబ గద్వాల 23 మే 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- మల్దకల్. ఆదిశిలా క్షేత్రం, హరిహరాదుల కొలువైన మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం పౌర్ణమి సందర్భంగా శ్రీ తిమ్మప్ప స్వామి కళ్యాణాన్ని ఉదయం 11 గంటలనుండి నిర్వహించనున్నట్లు దేవాలయ వ్యవస్థాపక వంశీయులు శ్రీకృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాద రావు, ఈ ఓ సత్య చంద్రారెడ్డి తెలిపారు. కళ్యాణం జరిపించు దాతలు దేవాలయ కార్యాలయంలో రూ.2,500 చెల్లించి కళ్యాణంకు హాజరు కావాలన్నారు. కళ్యాణం జరిపించు భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి స్వామి సేవలో పాల్గొనాలని తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333