భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి చిత్రపటానికి నివాళులర్పించిన 

గద్వాల ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి గారు 

Dec 27, 2024 - 12:19
 0  6
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి చిత్రపటానికి నివాళులర్పించిన 

ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి అనారోగ్యంతో మృతి చెందారు సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దేశం ఆర్థికంగా క్లిష్ట సమయంలో వున్నప్పుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంలో ఆర్థికరంగ నిపుణుడుగా తన విద్వత్తును ప్రదర్శించారని కొనియాడారు.పీవీ మనసు గెలిచిన మన్మోహన్ సింగ్ ఆనేక ఉన్నత శిఖరాలకు చేరుకున్న భరతమాత ముద్దుబిడ్డగా కొనియాడారు. మిత భాషిగా, అత్యంత సౌమ్యుడుగా, జ్ఞానాన్ని సొంతం చేసుకున్న స్థిత ప్రజ్ఞత కలిగిన నేతగా, భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలు గొప్పవి అన్నారు.2014 లో బిజెపి చేసిన బలహీన ప్రధాని అనే విమర్శలకు కౌంటర్ ఇచ్చాడు. నేను వీక్ పీఎం కానేకాదు. పరిస్థితులకు అనుగుణంగా బాగానే పనిచేశా.సమకాలీన మీడియా కంటే చరిత్ర నన్ను దయతో గుర్తుపెట్టు కుంటుంది.గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ  ప్రజలకు పని కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని మన్మోహన్ సింగ్ హయాంలోనే ప్రారంభించారు RTI, US తో న్యూక్లియర్ డీల్, విద్యా హక్కు చట్టం, జాతీయ ఆహార భద్రత చట్టం, నేషనల్ హెల్త్ మిషన్, ఆర్థిక జిడిపి, పటిష్ట విదేశాంగ విధానాలతో ఆయన బలహీన ప్రధాని కాదని నిరూపించుకున్నారు.మన్మోహన్ సింగ్ మరణం భారత దేశానికి తీరని లోటని శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, కౌన్సిలర్స్ దౌలు, పూడూరు కృష్ణ, నాయకులు ప్రభాకర్ గౌడ్, గోవిందు,కురుమన్న ధర్మ నాయుడు సంగాల నర్సింహులు, గంట రమేష్, మోబిన్, కొత్త గణేష్ , శ్రీనివాస్ యాదవ్, వీరేష్, వెంకటస్వామి, రాజు, ప్రవీణ్, తిమ్మప్ప, నాగార్జున, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333