బిఎస్పీ చర్ల మండల అధ్యక్షుడిగా కొండా చరణ్ నియామకం

ఎస్సీ ఎస్టీ బీసీ మత మైనారిటీలు ఐక్యమై బహుజన రాజ్యాన్ని సాధించాలి
కుమ్మరి రాంబాబు భద్రాచలం నియోజకవర్గ అధ్యక్షులు
చర్ల మండలంలోని బీఎస్పీ కార్యాలయంలో బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య నాయకుల అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన బహుజన సమాజ్ పార్టీ భద్రాచలం నియోజకవర్గం అధ్యక్షులు కుమ్మరి రాంబాబు మాట్లాడుతూ పార్టీ ఉద్యమ అవసరాల రిత్యా చర్ల మండల బీఎస్పీ అధ్యక్షులుగా కొండా చరణ్ న్నీ నియమించడం జరిగిందని తెలిపారు చర్ల మండలాన్ని వచ్చే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ ప్రతిష్టంగా తీసుకుందని బహుజన సమాజ్ పార్టీ చర్లలో గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు చర్ల మండలంలో పార్టీని మరింత బలం పెంచే దానికోసం కోసం చర్ల మండలంలో బిఎస్పి రాజ్యాధికారంలోకి తీసుకురావడం కోసం బీఎస్పీ తీవ్రంగా పని చేస్తుందని అందులో భాగంగానే జిల్లా నాయకుడుగా ఉన్న కొండా చరణ్ న్నీ చర్ల మండలంలో తిరిగి నియమించడం జరిగిందని తెలిపారు కచ్చితంగా కొండా చరణ్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పార్టీ నాయకత్వం నిరంతరం ప్రజలకు మరింత అందుబాటులో ఉంటుందని అందుకోసమే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు బహుజన ప్రజానీకం పార్టీని ఆదరించాలనీ పిలుపునిచ్చారు ఈ సమావేశంలో భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి సామల ప్రవీణ్ భద్రాచలం నియోజకవర్గం కార్యదర్శి చర్ల మండల ఇన్చార్జి చల్లగుండ్ల సతీష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు