బీచుపల్లి గ్రామపంచాయతీ కొండపేట గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణం కు భూమి పూజ .
జోగులాంబ గద్వాల3 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: ఎర్రవల్లి మండల కేంద్రం బీచుపల్లి గ్రామపంచాయతీ కొండపేట గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ ఆదేశాల మేరక ఎర్రవల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సెక్రెటరీ అరుణ అధ్యక్షతన 5 లక్షల రూపాయల విలువైన సిసి రోడ్డు నిర్మాణం కొరకు భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు షేక్ పల్లె నరసింహులు, గొల్ల నరసింహులు, తెలుగు వెంకటన్న ,నాగరాజు, చిన్న ఎల్లారెడ్డి సహదేవుడు, పూజారి రామాంజనేయులు, యాక్తాపూర్ శేషన్న, బండలయ్య, వెంకటన్న, కారోబార్ లక్ష్మణ్ ,పర్ష తదితర కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.