ఎర్రవల్లి శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ ( CBSE ) స్కూల్ నందు వసంత పంచమి వేడుకలు...

Feb 3, 2025 - 19:16
 0  2
ఎర్రవల్లి శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ ( CBSE ) స్కూల్ నందు వసంత పంచమి వేడుకలు...
ఎర్రవల్లి శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ ( CBSE ) స్కూల్ నందు వసంత పంచమి వేడుకలు...
ఎర్రవల్లి శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ ( CBSE ) స్కూల్ నందు వసంత పంచమి వేడుకలు...

జోగులాంబ గద్వాల 3 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: ఎర్రవల్లి మండల. కేంద్రంలోని సరస్వతి పాఠశాల విద్యార్థులకు వసంత పంచమి శుభాకాంక్షలు పాఠశాల కరస్పాండెంట్  మధులిక రెడ్డి తెలియజేశారు. ఆ తర్వాత సరస్వతి పూజ భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన కరస్పాండెంట్  మధులిక రెడ్డి మొదటగా సరస్వతి దేవి పూజ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించి నూతన విద్యార్థులకు ఉచిత అడ్మిషన్ జరుగులాగున ఆ చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించి మన పాఠశాల నందు నూతన అడ్మిషన్ పొందినందుకుగాను అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీ సరస్వతి వసంత పంచమి రోజును పురస్కరించుకొని విద్యార్థులచే సరస్వతి నమస్తుభ్యం వరదే కామ రూపిణి విద్యారంభం కారిష్యామీ సిద్ధిర్బవతుమేషద అంటూ శ్లోకాన్ని చిన్నారులతో పలికించడం జరిగినది.. జ్ఞాన సరస్వతి పుట్టినరోజు పురస్కరించుకుని ఆ సరస్వతి తల్లిని గుర్తు చేసుకుంటూ ఆ చదువుల తల్లి మా అందరికీ ఈ సంవత్సరం కూడా విద్యాబుద్ధులు క్రమ క్రమంగా పెంపొందించుకునేలా చూడాలని పాఠశాల కరస్పాండెంట్  మధులిక రెడ్డి కొనియాడారు.

     ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శ్రీ వీర గోవర్ధన్ రెడ్డి డైరెక్టర్ శ్రీ వీర శ్రీనివాస్ రెడ్డి కరస్పాండెంట్ శ్రీమతి మధులిక రెడ్డి ప్రిన్సిపాల్ నందిని కేని అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333