బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు కృషి చేయాలి
బిసి టియు రాష్ట్ర అధ్యక్షులు బెల్లంకొండ రామ్మూర్తి గౌడ్
సూర్యాపేట, 02 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని బీసీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బెల్లంకొండ రామ్మూర్తి గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడారు. పాపన్న ను స్ఫూర్తిగా తీసుకోని బడుగు బలహీన వర్గాలు బహుజన రాజ్య స్థాపనే ధ్యేయంగా పాటు పడాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నాటి దొరల అరాచకాలు మొగలాయిల దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కొని సామాన్య ప్రజల హక్కులను కాపాడిన గొప్ప యోధుడని కొనియాడారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం పరితపించిన పాపన్న గౌడ్ నేటి తరానికి ఆదర్శనీయమని అన్నారు. కార్యక్రమంలో గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్తలూరి యాదగిరి గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు అల్లాడి సత్యనారాయణ గౌడ్, గొపగాని సుధాకర్ గౌడ్ గుణగంటి సురేందర్ గౌడ్, జిల్లా కార్యదర్శి వేణు సిద్ధార్థ్ గౌడ్, సూర్యాపేట డివిజన్ అధ్యక్షుడు లింగాల రవి, కార్యదర్శి సురభి శ్రీధర్ గౌడ్, తుంగతుర్తి డివిజన్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ గౌడ్, తండ అంజయ్య గౌడ్, బైరు విజయ్ గౌడ్, చిత్తలూరి రవీందర్ గౌడ్, ఉయ్యాల నర్సయ్య గౌడ్, పులుసు శ్రీనివాస్ గౌడ్, అంతటి వెంకన్న గౌడ్, బాలగాని కుమార్ గౌడ్, మట్టపల్లి సైదులు గౌడ్, రెడ్డి మల్లికార్జున గౌడ్, గునుగుంట్ల నాగరాజు గౌడ్, రాచకొండ సురేష్ గౌడ్, రాచకొండ ప్రభాకర్ గౌడ్, మాజీ ఎంపిటిసి రాపర్తి శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.