ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికకు విశేష స్పందన

Apr 2, 2026 - 20:55
Apr 3, 2026 - 13:58
 0  0
ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికకు విశేష స్పందన

చిన్నంబావి మండల పరిసర ప్రాంతాలలో  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి నివేదన లో భాగంగా ఈరోజు చిన్నంబావి మండలంలోని వివిధ గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది.

చిన్నంబావి మండలంలో 17 గ్రామపంచాయతీల్లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా నిర్వహించడం జరిగింది.

02-04-2026 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం. చిన్నంబావి మండలంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణకు విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం (ఏప్రిల్ 2) మండల పరిధిలోని మొత్తం 17,గ్రామపంచాయతీల్లో గ్రామ సభలను ఘనంగా నిర్వహించారు. ప్రజల భాగస్వామ్యంతో సాగిన ఈ సమావేశాలు గ్రామ అభివృద్ధికి కొత్త దిశను చూపించాయి.ఈ గ్రామ సభలకు మండల ఎంపీడీవో రామస్వామి, తహసీల్దార్ శ్రీనివాసులు, గిర్దావరీ రాములు హాజరై ప్రజల సమస్యలను నేరుగా విన్నారు. గ్రామాల్లోని అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై ప్రజలతో చర్చించారు. గ్రామ స్థాయిలో సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా సర్పంచులు, వార్డు సభ్యులు, విద్యుత్ శాఖ అధికారులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు కూడా చురుకుగా పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో సర్పంచులు అధికారులు సమన్వయంతో కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రత్యేకంగా నిలిచింది.జిల్లా పంచాయతీ అధికారి రఘునాథ్ రెడ్డి పెద్ద దగడ గ్రామంలో, తహసీల్ధార్ అమ్మాయిపల్లి గ్రామంలో, ఎంపీడీవో లక్ష్మీపల్లి గ్రామంలో పాల్గొని కార్యక్రమాలను పర్యవేక్షించారు. మిగతా గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమించి, గ్రామ సభలను సమర్థవంతంగా నిర్వహించారు.సంక్షేమ పథకాలపై అవగాహన

ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు.అర్హులైన లబ్ధిదారులు ఇంకా పథకాల నుంచి మిగిలి ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులూ సూచించారు. ప్రతి అర్హుడికి ప్రభుత్వం అందించే ప్రయోజనాలు చేరేలా కృషి చేస్తామని తెలిపారు.ప్రజల నుంచి మంచి స్పందన

గ్రామ సభలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే వేదికగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతోందని గ్రామస్తులు తెలిపారు.అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం పెరగడం వల్ల గ్రామాల రూపురేఖలు మారతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.సహకరించిన వారికి కృతజ్ఞతలు.గ్రామ సభలను విజయవంతం చేసిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలకు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State