ఐడిఏ (ఇండియన్ డెంటల్ అసోసియేషన్) జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ పెద్దిరెడ్డి మహేష్

సూర్యాపేట:- ఇండియన్ డెంటల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ పెద్దిరెడ్డి మహేష్ 2024-25 .సంవత్సరానికి ఎన్నికైనారు. గురువారం త్రిబుల్ ఆర్ ఫంక్షన్ హాలులో జరిగిన ప్రమాణస్వీకార మహోత్సవాల్లో డాక్టర్ మహేష్ తో పాటు కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసినారు .ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్యఅతిథిగా స్టేట్ ఐడిఏ ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ నాగు బండి కిరణ్ కుమార్ విచ్చేసి ఎన్నికైన కార్యవర్గం చే ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా దేవరకొండకు చెందిన డాక్టర్ శివ సంతోష్ ప్రసంగించారు. కార్యదర్శిగా డాక్టర్ చిప్పలపల్లి అరుణ్ కుమార్, కోశాధికారిగా డాక్టర్ దేవరశెట్టి దినేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ కోదాడ ,తుంగతుర్తి, తిరుమలగిరి, ఇంకా పలు ప్రాంతాల నుంచి డెంటల్ డాక్టర్లు తమ కుటుంబాలతో సహా పాల్గొన్నారు.