చదువుకు సహకరించండి

Jul 13, 2025 - 19:54
 0  11
చదువుకు సహకరించండి

వనవాసీ ఉపాద్యక్షులు జవ్వాది

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం

చర్ల, జూలై 13 

 పేద విద్యార్దుల చదువులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని చర్ల మండలంలోని సీనియర్ జర్నలిస్ట్, వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్ది నిలయ ఉపాద్యక్షులు జవ్వాది మురళీకృష్ణ దాతలకు విజ్ఞప్తి చేసారు. చర్లకు చెందిన తూము రాము తన తల్లిదండ్రులు తూము శ్రీను, రమణల జ్ఞాపకార్థం వనవాసీ విద్యార్ది నిలయం కు 10 కేజీల కందిపప్పు, 10 కేజీల ఉప్మారవ్వ, 10 కేజీల ఉల్లిపాయలు, 10 కేజీల బంగాళాదుంపలు, 5 కేజీల క్యాబేజీ, మీల్ మేకర్, ఇతర కూరగాయలను అందచేసారు. ఈ సందర్భంగా నిలయ కమిటి ఉపాద్యక్షులు మురళీకృష్ణ మాట్లాడుతూ మారుమూల అటవీప్రాంత గ్రామ ఆదివాసీ విద్యార్థులు చదువుకుంటుంన్న కొమరం భీం విద్యార్ది నిలయం విద్యార్దులకు దాతలు సహకరిస్తుండటం సంతోషకరమని అన్నారు. దేశంలో ఆహార కొరత లేదని విద్యా, ఆరోగ్యం మెరుగు పడాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్క విద్యార్ది చదువుకొని ఉన్నత స్దితికి చేరుకొంటే వారి తరతరాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ చదువుకునే విద్యార్థులను ప్రోత్రహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు గాను దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేసారు. విద్యార్దులు సైతం దాతల నమ్మకాన్ని వమ్ము చేయకుండా చదువుపై దృష్టిసారించి ఉన్నత స్దితికి చేరుకోవడం ద్వారా వారి నమ్మకాన్ని నిజం చేయాలన్నారు. విద్యార్దులు చక్కగా చదివితే ఉపాద్యాయులు, తల్లితండ్రులతో పాటు దాతలు హర్షిస్తారని అన్నారు. సమయం వృదా చేయకుండా క్రమశిక్షణతో చదివి ఉన్నత స్దితికి చేరుకోవాలని విజ్ఞప్తి చేసారు. కార్యక్రమంలో వనవాసీ ప్రఖండ ప్రముఖ్ గొంది శోభన్‌బాబు, నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్నకుమారి, విద్యార్థులు పాల్గొన్నారు.