ప్రైవేట్ ఆస్పత్రులలో సిజేరియన్ సెక్షన్ కాన్పులు తగ్గించాలి.. 

నిబంధనలకు విరుద్ధంగా కాన్పులు చేసిన ఆసుపత్రులపై కఠిన చర్యలు.

May 23, 2024 - 20:10
May 23, 2024 - 21:25
 0  16
ప్రైవేట్ ఆస్పత్రులలో సిజేరియన్ సెక్షన్ కాన్పులు తగ్గించాలి.. 

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం. 

సూర్యాపేట 23 మే తెలంగాణవార్త రిపోర్టర్:-: జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా సిజేరియన్ సెక్షన్ కాన్పులు నిర్వహిస్తున్నారని, ఉల్లంఘించిన ఆసుపత్రుల అనుమతులు రద్దు చేయబడతాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలం హెచ్చరించినారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో గురువారం నిర్వహించిన సిజేరియన్ సెక్షన్ ఆడిట్ కమిటీ సమావేశంలో సమీక్ష నిర్వహించారు. ఇప్పటినుండి ప్రతి ప్రైవేటు ఆసుపత్రిలో నిర్వహించిన సిజేరియన్ సెక్షన్ కాన్పులపై ఆడిట్ జరుగుతుందని, నిబంధనలకు విరుద్ధంగా కడుపుకోత ఆపరేషన్లు నిర్వహించిన ఆసుపత్రుల నుండి వివరణ కోరుతామని, వీలైతే ఆసుపత్రుల యొక్క అనుమతి రద్దు చేస్తామని తెలిపారు. మొదటి కాన్పు కొరకు వచ్చిన ప్రతి గర్భిణీ స్త్రీ సాధారణ కాన్పు అయ్యేటట్లు చూడాలని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు సూచించినారు. సాధారణ కాన్పు వలన గర్భిణీ స్త్రీలకు ఎంతో లాభం ఉంటుందని, ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కావనీ, తదుపరి కాన్పులకుకూడా ఎటువంటి  ఇబ్బందీ ఉండదని తెలిపినారు. సిజేరియన్ సెక్షన్ కాన్పుల వల్ల గర్భిణీ స్త్రీ కి ఆరోగ్య వ సమస్యలతో పాటు ఆర్థికంగా నష్టపోతారని, వారి ఆరోగ్యమే ముఖ్యమని తల్లి పిల్లలు క్షేమంగా ఉండాలని కోరి కాన్పులు చేయాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు నిర్వహించిన సిజేరియన్ సెక్షన్ కాన్పుల ప్రతి కేసు షీటును ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రొఫెసర్లు డాక్టర్ అమిత కుమారి, డాక్టర్ దమయంతి క్షుణ్ణంగా పరిశీలించి తమ యొక్కఆడిట్ అభిప్రాయాలను తెలియజేసారు. వారిఆడిట్ అభిప్రాయాల మేరకు ఆసుపత్రుల నుండి వివరణ కోరి తదుపరి చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమీక్షలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ జై శ్యామసుందర్ పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333