ప్రస్తుత పంటల విధానాన్ని సమీక్షించాలి.

Aug 4, 2024 - 19:58
Aug 21, 2024 - 21:22
 0  4
ప్రస్తుత పంటల విధానాన్ని సమీక్షించాలి.

 చిరుధాన్యాలతో  ఆరోగ్య పరిరక్షణ వైపు దృష్టి సారించాలి.*  వికృత ఆహారం అందుబాటులో ఉండకుండా  కల్తీలు జరగకుండా ప్రభుత్వం కొరడా ఝు లిపించాలి. * వ్యవసాయాన్ని లాభసాటిగా  తీర్చిదిద్ది  రైతు ప్రయోజనాలు పరిరక్షించాలి.* 
**††********
---వడ్డేపల్లి మల్లేశం 
ఆరోగ్యము వ్యవసాయము  పోషక విలువలకు సంబంధించి భారత దేశంలో అనేక పరిశోధనా సంస్థలు  చేసిన హెచ్చరికలు సూచనలను  ప్రభుత్వం ముందుండి రైతు సంఘాలతో సమీక్షించి ప్రత్యామ్నాయ విధానాలను అనుసరించడం తక్షణ కర్తవ్యం. కానీ ఆ వైపుగా దృష్టి సారించినట్లుగా కనిపించడం లేదు  దాని కారణంగా  పోషక విలువలు లేని ఆహారంతో ప్రజలు నష్టపోతుంటే  లాభ సాటిలేని వ్యవసాయంతో ప్రభుత్వ సహకారం లేకుండా  రైతులు  గిట్టుబాటు ధర ప్రతిఫలం లేకుండా  పోరాటాల బాట పడుతుంటే  ప్రభుత్వాలు  మిన్న కుండడం ఎవరి ప్రయోజనం కోసం ? ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ప్రాచీన నానుడి.  కానీ ఆధునిక యాంత్రిక  ముసుగులో  రుచుల కోసమే ఆరాటపడుతున్న ప్రజలు యువత  అందులో ఉన్న విష పదార్థాలు కల్తీలను ప్రభుత్వాలు కట్టడి చేయకపోవడం , ప్రస్తుతం పండిస్తున్నటువంటి ఆహార పదార్థాలలో పోషక విలువలు క్రమంగా తగ్గిపోవడం  వ్యవసాయం సంక్షోభంలో చిక్కింది అనడానికి నిదర్శనం కాదా ! వైజ్ఞానిక పర్యావరణ కేంద్రం అధ్యయనములో   వెలువడిన  గణాంకాలను పరిశీలిస్తే భారతదేశంలో 71 శాతం మందికి సమతుల ఆహారం  దొరకడం లేదని  కనీసం  రెండు పూటలా తిండికి నొచని పరిస్థితుల కారణంగా అనారోగ్యంతో  ఏటా 17 లక్షల మంది మ  మృత్యువాత పడుతున్నారని  తెలుస్తుంటే  సమాజము యావత్తు దిగ్బ్రాంతికి గురి కావలసినదే . మరో అధ్యయనం ప్రకారం  వయసుతో సంబంధం లేకుండా  అలవాటు పడిన జంక్ ఫుడ్ ప్రమాదకర  పరిస్థితుల కారణంగా    తీవ్ర అనారోగ్య బారిన పడుతుంటే  ప్రతి  నలుగురిలో ఒకరు స్థూలకాయులని  పిల్లలను పెద్దలను కలిపి పరిశీలిస్తే  ప్రతి నలుగురిలో  ఒకరు షుగరు బాధితులని  తేలింది . పరిమితి లేని  చక్కెర, సోడియం ,కొవ్వు పదార్థాల వినియోగంతో  అనుమతులు లేకుండా వినియోగిస్తున్న జంక్ ఫుడ్  పరిణామాలను కట్టడి చేయడానికి ప్రత్యేక బిల్లు తేవాలని సూచనలు వస్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించకపోవడం  విడ్డూరం . ఇక దేశంలోని ఐదేళ్లలోపు పిల్లల్లో పౌ  పౌష్టికాహార లోపాలు  థా రా స్థాయికి చేరినట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే  వెల్లడించడం మరింత  ఆందోళనకర పరిణామం.
       మన ప్రధాన ఆహార పంటలైన వరి గోధుమలలో  వ్యాధి నిరోధక  పోషక పదార్థాలు క్యాల్షియం, ఇనుము, జింకు వంటి అనేక  ఖనిజ వనరులు క్రమంగా అడుగంటి పోవడంతో  ఆహార పదార్థాలు కూడా మరింత ఊబకాయాన్ని మధుమేహాన్ని పెంచడానికి  కారణమవుతున్నట్టు తెలుస్తున్నది.  ఇక మరొకవైపు విష పదార్థాలైనటువంటి ఆర్సినిక్ ,బేర్యం  వంటి ఖనిజ వనరులు  ఎక్కువ అవుతుండడంతో పోషక విలువలు లేకపోగా మరింత అనారోగ్యం బారిన పడడానికి  ప్రస్తుతం పండిస్తున్న పంటలు  ప్రజలకు హాని చేయడం కూడా  సవాలుగా మారింది  .
      ప్రభుత్వాల బాధ్యతారాహిత్యం చేపట్టవలసిన చర్యలు :-
*†******
ఇటీవల కాలంలో సమతుల ఆహారాన్ని  ప్రజలకు అందుబాటులో ఉంచడానికి అన్ని రకాల  ధాన్యాలు పండే విధంగా పంటల విధానాన్ని సవరించి సమీక్షించి రైతులతో ముచ్చటించి పరిష్కరించవలసినది పోయి  తెలంగాణ రాష్ట్రంలోనైతే కేవలం  నీ టి సరఫరా పేరుతో వరికి మాత్రమే అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అనే  అనేక ఆహార పదార్థాలు అందుబాటులో లేకుండా పోయింది.  కరోనా  2020 ప్రాంతంలో ముఖ్యంగా   రోగ నిరోధకతను పెంచే పౌష్టికాహారం ప్రజలకు అవసరమని  పరిశోధనలు ప్రభుత్వాలను హెచ్చరించినప్పటికీ  ప్రస్తుతం 81 కోట్ల మందికి  ఉచిత బియ్యం ఇవ్వడం ద్వారా చేతులు దులుపుకుంటున్న విధానాన్ని గమనిస్తే  ప్రజలకు పోషకాహారం ఎలా అందుతుంది? ఆరోగ్యంగా ఎలా ఉండగలరు?  ఈ కష్ట పరిస్థితుల్లో ఆలోచించి పరిష్కారం చూపాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిన్నకుంటే ఎలా ? పీల్చే గాలి తాగే నీరు కూడా అపరిశుభ్రమై కలుషితమై  పెట్టుబడిదారులు ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం దోపిడీ కారణంగా  ఇప్పటికే ఇబ్బంది పడుతున్న ప్రజలకు కనీసం  ప్రణాళిక బద్ధమైన పౌష్టిక ఆహారాన్ని అయినా సరఫరా చేయడానికి  ప్రభుత్వాలు పూనుకోకుంటే  ఇక రానున్నది గడ్డు కాలమే . ప్రపంచంలో కొన్ని దేశాలు ప్రణాళికాబద్ధంగా పౌష్టికాహారాన్ని పంపిణీ చేపడుతూ ప్రజల జీవన ప్రమాణాలను  కాపాడుతున్నట్టు తెలుస్తుంటే  భారతదేశంలో మాత్రం 30 శాతానికి పైగా పిల్లలు  పోషకాహారము లేక విష పదార్థాలను ఆరగి 0చడం వలన  అర్ధా 0తరంగా జీవితాలు చాలి0చడం ఆందోళన కలిగించే విషయం కాదా ? ఐదు సంవత్సరాలలోపు పిల్లలలో  పోషకాహార లోపాల కారణంగా 68 శాతం మంది  మృత్యువాత పడుతున్నట్టు తెలుస్తుంటే ఇక ప్రభుత్వాలు  ఎవరిని ఉద్ధరిస్తున్నట్లు? ఏ వర్గ ప్రయోజనం కోసం పనిచేస్తున్నట్లు .?
   పరిశీలించి  పరిష్కరించవలసిన అంశాలు :-
***** ఎముకలు నరాల పతుత్వంతో పాటు  రోగనిరోధక శక్తిని అపారంగా పెంచగలిగే  ఖనిజ వనరులు విటమిన్లు, పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను పండించడానికి  శాస్త్రవేత్తలతో కలిసి ప్రభుత్వాలు దృష్టి సారించి వంగడాలను రూపకల్పన చేయాలి.  ఇటీవల అనేకమంది శాస్త్రవేత్తలతో పాటు స్వతంత్ర శాస్త్రవేత్త  ఖాదర్ వలీ గారు చెప్పిన ప్రకారంగా  చిరు సిరి ధాన్యాలను అధికంగా వినియోగించగలిగితే  వ్యాధుల బారిన పడకుండా రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి  పోషక విలువలు గల ఆహారాన్ని పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని పలు వేదికల మీద ప్రచారం చేస్తూ ప్రభుత్వాలకు సూచనలు చేస్తున్న ఆలకించిన వారు లేరు. ప్రజల్లో అవగాహన కల్పించబడుతున్న ఈ తరుణంలో కొంతవరకు వినియోగించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ  సిరి ధాన్యాల పేరుతో చెప్పబడుతున్నటువంటి సామలు, ఊదలు, కొర్రలు, అండ్ కొర్రలు, అరికలు వంటివి  ధరలు ఎక్కువగా ఉండటం వల్ల సామాన్యులు కొనలేకపోతున్నారు  జొన్నలు సజ్జలు రాగులు  వరిగె లతో పాటు పైన తెలిపిన సిరి ధాన్యాలను పెద్ద మొత్తంలో పండించడానికి  రైతులను ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వాలు  ఆర్థికంగా ప్రోత్సహించాలి . వరికి మాత్రమే ప్రాధాన్యత కాకుండా  మిశ్రామహారాన్ని  అందుబాటులోకి తేవడం ప్రభుత్వ విధానంగా ఉండాలి ఆరోగ్య సిరులు కురవాలంటే  చిరుధాన్యాలు ప్రత్యేక మార్గమని  ఇటీవల అనేక అధ్యయనాలతో పాటు ప్రధాన మంత్రి కూడా పలు సందర్భాలలో  వ్యాఖ్యానించిన దృష్ట్యా అందులో ఉన్న పోషక విలువల ఆధారంగా  దేశవ్యాప్తంగా  పెద్ద మొత్తంలో పండించడానికి ప్రణాళికను నిర్బంధంగా అమలు పరచాలి.  ముఖ్యంగా చిరుధాన్యాలు భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైనందున  అన్ని రాష్ట్రాలలోనూ రాష్ట్ర ప్రభుత్వాలు  ప్రోత్సహించి ఆ రైతులకు  పెట్టుబడి సాయంతో పాటు  నాణ్యమైన  విత్తనాలు ఇతర సౌకర్యాలు కల్పిస్తే  జీవనశైలిని మార్చుకోవడంతోపాటు  ఆహార అలవాటును కూడా  ఆధునిక రీతిలో అలవర్చుకున్నప్పుడు  దేశ ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా చూడవచ్చు . ఇప్పటికే నాణ్యమైన విత్తనాలు పురుగుమందులు ఎరువులు లభించకపోవడం,  కల్తీలతో రైతులు మోసపోవడం , గిట్టుబాటు ధరలు  చట్టబద్ధత లేకపోవడం,  అనేక హక్కుల కోసం గత మూడు నాలుగు ఏళ్లుగా రైతులు దేశంలో పోరాటం చేస్తున్న  పట్టించుకోని పాలకులు ఒకవైపు ఉంటే ఈ దేశ ప్రజలకు పోషకాహారం ఎలా అందుతుంది?  రైతుల డిమాండ్లను పరిష్కరించాలి! ప్రజలకు పోషకాహారాన్ని అందించాలి !ఆ బాధ్యతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భుజానికి ఎత్తుకున్నప్పుడు మాత్రమే  ఈ సమస్య పరిష్కారం అవుతుంది.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333