వెల్దేవి గ్రామానికి బస్సును నడపాలని ఎమ్మెల్యే మందుల సామేల్ కి
వినతి పత్రం అందజేసిన గ్రామశాఖ అధ్యక్షులు మంటిపల్లి గంగయ్య
అడ్డగూడూరు 04 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామానికి ఆర్టీసీ బస్సును పునరిద్దరించాలని వెల్దేవి, అజింపేట గ్రామనికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలుకి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ యాదగిరిగుట్ట డిపో బస్సు మోత్కూరు కొండగడప, పార్టీమట్ల వయా దాచారం,రేపాక గ్రామాల మీదుగా కొండపేట , అజింపేట ,వెల్దేవి గ్రామానికి రోజుకు నాలుగు సార్లు ఆర్టీసీ నడపడం వలన గ్రామాల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటదని, బస్సులు నిలిపేయడం వలన ఈ గ్రామాల ప్రజలు పాటిమట్ల ఎక్స్ రోడ్డుకి వెళ్లి ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు.కావున ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకొని ఆర్టీసీ అధికారులకు దృష్టికి తీసుకెళ్లి బస్సును పునరుద్ధరించాలని కోరడం జరిగింది.అదేవిధంగా గంగ దేవమ్మ గుడి కాడ, అద్దాల లచ్చయ్య బావి దగ్గర్లో వర్షాలు వస్తే పలు గ్రామాలకు రాకపోకలు ఆగిపోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే కల్వర్టు పనులు ప్రారంభించాలని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ కు వినతి పత్రం వెల్దేవి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు మంట్టిపల్లి గంగయ్య అందజేయడం జరిగింది.వెల్దేవి, కమ్మగూడెం రోడ్డు బీటి రోడ్ చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బొమ్మగాని సైదులు,లింగయ్య , బలికే వెంకన్న,వెల్దేవి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు మంటిపల్లి గంగయ్య,మోత్కూర్ మాజీ డైరెక్టర్ బోడ యాదగిరి,రామదాసు,నిమ్మల నరసింహ,నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.