అకాల వర్షానికి తప్పిన పెను ప్రమాదం
తిరుమలగిరి 7 మే 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలం తో పాటు మున్సిపల్ కేంద్రంలో ఆదివారం సాయంత్రం వేచిన ఈదురు గాలుల వర్షానికి మున్సిపల్ కేంద్రంలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగినాయి భారీ చెట్లు రోడ్డుకు అడ్డంగా పడడంతో రాకపోకలకు ఇబ్బంది జరిగింది ఈదురు గాలులకు తప్పిన ప్రాణ నష్టం తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో ఈ రెంటి ఇస్తారు తన ఇంటి పైకప్పు ఈదురు గాలులకు అమాంతం కొట్టుకుపోయాయి బియ్యం తదితర సామాగ్రి తడిసి ముద్దాయి మున్సిపల్ కేంద్రంలోని మాలిపురం తాటిపాములతో పాటు 11వ వార్డులు రెండు వార్డుల్లో విద్యుత్ స్తంభాలు నెలకు వంగడంతో పెద్ద ప్రమాదం తప్పింది స్థానికులు అధికారులకు సమాచారం అందించిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసి తెగిన విద్యుత్ వైర్లను తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు తిరుమలగిరి మున్సిపల్ 1 వ వార్డు నెల్లిబండతండాలో గాలి దుమారానికి చెట్లు కూలి ఇంటిగోడలమీద పడి గోడలు, ఇంట్లో ఉన్నా నీళ్ల ట్యాంక్, సామాన్లు అన్నీ ధ్వంసం అయ్యాయి, తిరుమలగిరి స్థానిక తహసిల్దార్ కు సమాచారం అందించిన వెంటనే సంబంధిత అధికారులను సంఘటన జరిగిన ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఉన్న సమస్యలను ఆధారాలుగా తీసుకురావాలని ఆదేశాలు ఇచ్చారు తహసిల్దార్ ఆదేశాల మేరకు ఆర్ఐ ప్రసన్న నీలి బండ తండా మరియు తాటిపాముల తదితర గ్రామాల్లో పర్యవేక్షించారు సందర్శించని గ్రామాలు వెలిశాల తొండ మాలిపురం గ్రామాలలో ఇంటి పై కప్పు రేకులు పడిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కావున అధికారులు వెంటనే స్పందించి వారికి సహాయ సహకారాలు అందించాలని ప్రజలు బాధితులు తెలిపారు