ప్రమాదకరంగా డ్రైనేజీ పైకప్పు ...పట్టించుకోని అధికారులు
తిరుమలగిరి 05 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
గత రోజుల నుండి డ్రైనేజీ పైకప్పు ధ్వంసం అయినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని నాలుగవ వార్డులో స్థానిక మార్కెట్ యార్డు ఎదురుగా బ్రహ్మంగారి మఠం దారిలో గత నెల రోజుల నుంచి డ్రైనేజీ పైకప్పు ధ్వంసం అయినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. నిత్యం ప్రజలు తిరిగే ప్రధాన వీధి కావడంతో చీకట్లో వెళ్లే పాదచారులు, వాహనదారులు ఎప్పుడేం ప్రమాదం జరుగుతుందోనని భయంతో ప్రయాణిస్తున్నారన్నారు.
డ్రైన్ పై కప్పు కూలిపోవడంతో ప్రమాదకరంగా మారిందన్నారు. పొరపాటున రాత్రిపూట ఎవరైనా అటుగా వెళ్లాలంటే అందులో పడే ప్రమాదం ఉందన్నారు. డ్రైనేజీ పూర్తిగా కూలిపోవడంతో మురికి నీరు నిల్వ ఉండడంతో దుర్వాసన వెదజల్లుతుందని, దోమలకు ఆవాసంగా మారి కాలని వాసులు అనేక రోగాల బారిన పడుతున్నారని వాపోతున్నారు. సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని కాలనీవాసులు కోరారు