చాపల లోడుకు అడ్డుకున్న గ్రామస్తులు
ఆత్మకూరు ఎస్ 5 ఏప్రిల్2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- చాపల లోడుకు అడ్డుకున్న గ్రామస్తులు..గ్రామస్తులకు ఇవ్వకుండా బయటకు తరలిస్తున్నారంటూ ఆందోళన... ఆత్మకూరు ఎస్... తమ గ్రామంలోని చెరువులో చాపలు పెంచి గ్రామానికి ఇవ్వాల్సిన ఒప్పందాన్ని గాలికి వదిలేసి చాపలను పక్కదారులు బయటికి విక్రయిస్తున్నానుతో గ్రామస్తులు చాపల లోడ్ అడ్డుకొని ఆందోళన చేసిన దృశ్యం మండల పరిధిలోని ఏపూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామంలో నీ శుభసముద్రం చెరువులో పెద్ద పెద్దకాలంగా గ్రామస్తుల ఒప్పందం ప్రకారం చాపలు పెంచిన కాంట్రాక్టర్ శనివారం గ్రామంలో ఎవరికి వికరించకుండా చాపలు పట్టి లారీలతో గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నట్లు అరోపించారు. మండుటెండలు ఉదయం నుండి సాయంత్రం వరకు చెరువులో క్యూ లైన్ లో ఉన్నప్పటికీ గ్రామస్తుల ఇవ్వకుండా బయటికి తరలిస్తుండగా గ్రామంలో లారీని అడ్డుకున్నారు. చాపల కాంట్రాక్టర్ వాదనకు దిగారు. మరో వారంలోపు చెరువులో ఉన్న చేపలను పట్టి గ్రామస్తులకు సరిపడా ఇచ్చిన తర్వాతనే బయటికి అమ్ముకుంటానని చాపల కాంట్రాక్టర్ హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. *నసీంపేట లోనూ గ్రామస్తుల ఆగ్రహం. మండల పరిధిలో నర్సంపేట ఊర చెరువులో గ్రామస్తులు తెలియకుండా కాంట్రాక్టర్ శనివారం చేపలు పట్టే అమ్ముకుంటున్నారని ఆరోపించారు. గ్రామానికి చెందిన చెరువులు చాపలు పోసి పెంచి గ్రామస్థులకు విక్రయించకుండా ఇస్తాను సారంగా చాపలను బయటకు విక్రయించాలని తీవ్రంగా ఖండించారు. రైతుల పంట పొలాలు ఎండుతున్నప్పటికీ తెలుగు నీటిని విడుదల చేయకుండా చాపల కోసం కాపలా ఉంచితే చివరికి గ్రామాల వారికి అమ్మకుండా బయటికి విక్రయించడాన్నీ తీవ్రంగా ఆగ్రాహo వ్యక్తం చేశారు