ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య:జెడ్పి చైర్ పర్సన్ సరిత
ప్రొ. జయశంకర్ బడిబాట కార్యక్రమం లో పాల్గొన్న జెడ్పి చైర్ పర్సన్.
జోగులాంబ గద్వాల 15 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల్. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందుతోందని జెడ్పి చైర్ పర్సన్ సరిత అన్నారు. జూన్ 6 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించే బడిబాట కార్యక్రమాన్ని సరిత శనివారం గద్వాల్ పట్టణం లోని 16 వార్డులోని ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పని సరిగా బడులకు పంపించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించడంతో పాటు ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, నోటు బుక్కులు అందిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం 2023-24 సంవత్సరం పదవ తరగతిలో 9 పాయింట్లుకు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు శాలువా, మెమోటో లతో అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేశవులు,కౌన్సిలర్లు అనిత శ్రీనివాస్ రెడ్డి,డిటిడిసి అనిత నర్సింహులు,మహేష్, టి.శ్రీనివాసులు,మహ్మద్ ఇసాక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్లు ఎల్లప్ప,తుమ్మల నర్సింహులు, నాగ శంకర్, భాస్కర్ యాదవ్,బంగీ సుదర్శన్,గోవింద్,కొత్త గణేష్,జమ్మిచేడు రాము, మోహన్ యాదవ్,ఎస్పీ దేవరాజు, షాష,రాము యాదవ్,పరుశ, పాఠశాల హెడ్ మాస్టర్ వెంకట నర్సయ్య తదితరులు ఉన్నారు.