సర్వసభ్య సమావేశం..
జోగులాంబ గద్వాల 15 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాల యంలో శనివారం ఎంపీపీ బేగం అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే అంటూ వ్యాధులకు ప్రబలకుండా గ్రామాలలో తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి వ్యాధులకు గురి కాకుండా ముందస్తు ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి శంషాద్ ఇస్మాయిల్,అధికారులు పాల్గొన్నారు.