పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి....చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది...
మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక శుభ్రత డ్రైవ్...
సూర్యాపేట... “పరిశుభ్రమైన వాతావరణం ప్రజల ఆరోగ్యానికి ఎంతో అవసరమని ప్రతి కార్యాలయంలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. “99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక”లో భాగంగా శనివారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక శుభ్రత కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో స్పెషల్ క్లీనింగ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పరిశుభ్రత కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యాలయాలతో పాటు పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది తమ కార్యాలయాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ప్రజల్లో కూడా పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ హన్మంతరెడ్డి, వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, మున్సిపల్ అధికారులు మేనేజర్ బుచ్చి బాబు,సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్,ఆర్వో కళ్యాణి, టిపిఒ సోమయ్య, సీనియర్ అస్సిటెంట్లు జానపాటి నాగయ్య ,శ్రీను యం.డి గౌసుద్దీన్ ,ఎస్.ఎస్.ఆర్.ప్రసాద్,ఏనేపల్లి యాదగిరి, అజీముద్దీన్ ,టీఎంసీ శ్వేత ,ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్ సిఏచ్ .శివ ప్రసాద్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.