ప్రపంచంలో మొదటి జర్నలిస్టు  మాదిగే

Aug 21, 2024 - 19:16
 0  3
ప్రపంచంలో మొదటి జర్నలిస్టు  మాదిగే
ప్రపంచంలో మొదటి జర్నలిస్టు  మాదిగే

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం.

మాదిగలకు 12 శాతం వాటా ఇవ్వాల్సిందే

మాదిగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ పిడమర్తి రవి

జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు పోరాటం కొనసాగిస్తాం

తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర  అధ్యక్షులు బూరుగుల నాగేందర్ మాదిగ

హైదరాబాద్, ఆగస్టు 21

ప్రపంచంలోనే మొదటి జర్నలిస్టు మాదిగేనని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరి గారి ప్రీతం అన్నారు బుధవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బూరుగుల నాగేందర్ మాదిగ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర ప్రథమ మహాసభకు వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు .రాజుల కాలంలో  ప్రస్తుత కాలంలో మాదిగలే  డప్పులు భుజాన వేసుకోని వీధి వీధిల్లో తిరుగుతూ మొదటి సమాచారం అందించిన తొలి జర్నలిస్టులుగా నిలిచారని గుర్తు చేశారు. మాదిగలంతా గుంపులు గుంపులుగా ఉన్నామని మనకు సమస్యలు సంభవిస్తే ఒక గ్రూపుగా ఉండలేకపోవడం మన జాతి దురదృష్టం అని ఇప్పటికయిన మన జాతి ఒక గ్రూపుగా ఉండాలని అన్నారు.మనమంతా కలిసి పోరాడితే మనల్ని ఆపేవారు రాష్ట్రంలో గాని దేశంలోగాని ఎవరు లేరనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుఎరిగి పనిచేయాలని అన్నారు. రాష్ట్రంలో అక్కడక్కడ మాదిగ మాదిగ ఉప కులాల జర్నలిస్టు లు నిజాన్ని నిర్భయంగా రాయడం వలన పలుచోట్లా దాడులు కూడా  జరిగాయి అన్నారు . మనమంతా ఐకమత్యంగా ఉండి పోరాడాలని జర్నలిస్టులపై దాడులు జరిగితే చూస్తూ ఊరుకోబోనని సభ ముఖంగా జర్నలిస్టులకు భరోసా కల్పించారు.జిల్లా, రాష్ట్ర స్థాయి అక్రెడేషన్  కమిటీలలో మనజాతి వారు ఉండేలా తగు చర్యలు తీసుకునేలా ప్రభుత్వంతో మాట్లాడి కమిటీలో ఉండేలాగా చూస్తానని హామి ఇచ్చారు.ముఖ్యంగా మనలాంటి పేద జర్నలిస్టులకు అందనిది ఏదైనా ఉందంటే అది విద్యా వైద్యం అని ప్రతి జర్నలిస్టులకు విద్యా వైద్యం అందేలా జర్నలిస్టుల కుటుంబాలకు హెల్త్ కార్డులు అందేలా ముందుండి పనిచేస్తానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల కోసం ఇంటి స్థలాలను ఇచ్చేందుకు సిద్దంగా ఉందని ప్రతి మండలంలో ఉన్నటువంటి జర్నలిస్టులకు అందేలా చూస్తానని హామిని ఇచ్చారు.ఎస్సీ వర్గీకరణ మనకు విధ్యా వైధ్యం , ఉద్యోగాలలో రిజర్వేషన్లు తప్పకుండ కావాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మాదిగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ పిడమర్తి రవి  మాట్లాడుతూ మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు అమలయ్యేంతవరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ పోరాటం న్యాయమైనదని గుర్తించి సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని గుర్తు చేశారు. తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు. రాష్ట్రంలో కొంతమంది కుల సంఘాల జర్నలిస్టు ఉద్యమాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని అలాంటి వ్యాఖ్యలు చేస్తే భవిష్యత్తులో వారికి తగిన బుద్ధి చెప్తామన్నారు. ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు హెల్త్ కార్డు ఇవ్వడంతోపాటు ఇంటి స్థలాలు ఇచ్చేంతవరకు ఉద్యమిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా బహుజన కళాకారులు పాడిన పాటలు సభికులను ఆకట్టుకున్నాయి. ఈ మహాసభలో రాష్ట్ర గౌరవ సలహాదారులు వత్తుల రఘుపతి, జిలకర కృష్ణకర్ ,పస్తం సైదులు, సుంచు లింగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కల్లపల్లి రాజేందర్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు కాటేపాగ హుస్సేన్, మైలారపు ప్రేమ్ కుమార్ రాష్ట్ర కార్యదర్శులు సుక్క అశోక్, అంకగళ్ల కరుణాకర్ ,దుబ్బ నాగేష్ ,కడియం నాగయ్య, రాష్ట్ర నాయకులు కుమ్మరి ముఖేష్, ఒగ్గు సోమయ్య,  సదానందం, కంబాలపల్లి రాములు, పెండ్యాల సుమన్ ,వసుకుల జయరాజు, ఎం పెళ్లి ముతేష్ ,చింత ప్రవీణ్ ,గంట వెంకన్న, పూస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333