అయేషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ మరియు సైబర్ నేరాలపై అవగాహనా

Aug 21, 2024 - 19:14
 0  22
అయేషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ మరియు సైబర్ నేరాలపై అవగాహనా

న్యూస్ తెలంగాణ సూర్యాపేట జిల్లా చిలుకూరు ఆగస్టు 21:- కేంద్రంలోని జెర్రిపోతులగూడెం లో చిలుకూరు ఏఎస్ఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జడ్పిహెచ్ఎస్ హైస్కూల్లో గంజాయి మరియు సైబర్ నేరాలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు ప్రతి గ్రామంలో స్కూల్లో కళశాలలో చదువుకునే విద్యార్థులు యువతీ యువకులు సైబర్ మోసగాళ్ల వల్ల మోసాలకు గురి కావద్దని బ్యాంక్ ఖాతా వివరాలు ఏటీఎం కార్డు వివరాలు ఓటిపిల వివరాలు ఇతరులకు తెలుపవద్దన్నారు సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాలన్నారు అలాగే వేధింపులకు 100 కు సమాచారం ఇవ్వాలన్నారు వ్యక్తిగత ఫోటోలు డిపిలుగా పెట్టుకోవద్దని మొబైల్ లో వచ్చేటటువంటి  యాప్ లపై క్లిక్ చేయొద్దు అన్నారు గంజాయి మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలోపాఠశాల జిహెచ్ఎం సైదయ్య కృష్ణారెడ్డి ఉపాధ్యాయులు చాంద్ పాషా నరసింహారావు నాగరాజు లింగయ్య అయేషా ఫౌండేషన్ అధ్యక్షులు ఇమ్రాన్ మరియు జానీ పాషా రహీం పోలీస్ సిబ్బంది విద్యార్థి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333