ప్రపంచ మేధావి, డా బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
తెలంగాణ వార్త మిర్యాలగూడ ఏప్రిల్ 14 :- మిర్యాలగూడ పట్టణములోని వివిధ విగ్రహానికి మరియు మిర్యాలగూడ బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయములో వారి చిత్రపటానికి పూలు ఉంచి నివాళులు అర్పించారు
భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావుమాట్లాడుతూ దేశానికి ఆ మహనీయుడు అందించిన సేవలనుసమ సమాజ భారత నిర్మాణం కోసం వారు చేసిన అజరామర కృషిని త్యాగాలను గుర్తుచేసి స్మరించుకున్నారుదళిత బహుజన సబ్బండ కులాలను అన్ని రంగాల్లో అగ్ర కులాలకు ధీటుగా తీర్చిదిద్దాలనే అంబేద్కర్ ఆశయాలను గడచిన పదేండ్ల కేసీఆర్ ప్రగతి పాలనలో నిజం చేసి చూపించారని అన్నారురైతులకు రైతుబంధు సహా దళిత, బీసీ, ఎస్టీ మైనారిటీ వర్గాలకు పలు పథకాలను కేసీఆర్ నాయకత్వంలో అందించడం వెనక అంబేద్కర్ స్పూర్తి ఇమిడివున్నదన్నారు75 ఏండ్ల స్వతంత్ర భారత దేశంలో మొట్టమొదటిసారిగాదళితబంధు వంటి పలు విప్లవాత్మక పథకాలను అమలులోకి తెచ్చి దళిత వర్గాలను ప్రగతిపథంలో నడిపించేందుకు కెసిఆర్ చేసిన కృషి దేశానికే ఆదర్శంగా నిలిచిందనిపదేండ్ల బీఆర్ఎస్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగంగా కొనసాగిందని పేర్కొన్నారురాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందని తెలిపారు వారికి కృతజ్జతగా తెలంగాణ సచివాలయానికి డా బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంగా నామకరణం చేసుకున్నామన్నారు. 125 అడుగులతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహాన్ని నెలకొల్పి అంబేద్కర్ మహాశయునికి తెలంగాణ సమాజం ఘనమైన నివాళిని అర్పించుకున్నదన్నారు దేశంలో మరెక్కడా లేని విధంగా అత్యధిక సంఖ్యలో తెలంగాణ రాష్ట్రంలో గురుకుల విద్యాసంస్థలను కెసిఆర్ హాయములో ఏర్పాటు చేశామన్నారు
కార్యక్రమములో అన్నబీమోజు నాగార్జున చారి, ఎండి. మోషీన్ అలీ,ఎండి. మాక్ధూమ్ పాషా,ఎండి. షోయబ్,పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, చౌగాని బిక్షం గౌడ్, నంద్యాల శ్రీరా౦ రెడ్డి, పునాటి లక్ష్మీనారాయణ,తీరాందాసు విష్ణు, శంకర్ నాయక్,దళిత ఐక్య వేధిక నాయకులువసుకుల మట్టయ్య అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షుడు దైద శ్రీనివాస్ ఎమ్మార్పీఎస్ జాతీయ పొలిటి బ్యూరో సభ్యుడు దైద సత్యం పోలెపాక సురేందర్, దైద కిరణ్ కుమార్ దైద శరత్ కుమార్ దైద శ్రీకాంత్ కేసరపు శంకర్ కత్తుల అవినాష్ నందిపాటి నరేష్ ఉబ్బ పల్లి శంకర్ దైద పవన్ ధైద వెంకటేష్ ఉబ్బుపల్లి రాజ్ కుమార్ రేగుడి ప్రతాప్ దైద సైదులు,మొండికత్తి బీఎస్పీ మిర్యాలగూడ ఇన్చార్జ్ పుట్టల దినేష్ లింగయ్య,నల్లగ0తుల నాగభూషణం,శిరసనగండ్ల ఈశ్వర్ చారి, మండలోజు సైదా చారి, నాంపల్లి యేసు,లక్ష్మా రెడ్డి,పగడాల శేఖర్, మహేష్,మురళి ,మహిళలు,యువకులు తదితరులు ఉన్నారు.