ఘనంగా అంబెడ్కర్ జయంతి వేడుకలు
వర్కింగ్ ప్రసిడెంట్ బాలెంల దుర్గయ్య ఆధ్వర్యంలో

పాల్గొన్న ఏడీఈ బాలు నాయక్
అడ్డగూడూరు 14ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కుర్ మునిసిపల్ కేంద్రం లోని విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంఘం భువనగిరి డివిజన్ వర్కింగ్ ప్రసిడెంట్ బాలెంల దుర్గయ్య ఆధ్వర్యంలో మోత్కూర్ సబ్ డివిజన్ కార్యాలయంలో మహాత్మ జ్యోతి రావు పూలే,డాక్టర్"బి ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏడీఈ బాలు నాయక్ 1104 నాయకులు గోడిశాల నర్సింహా బిసి జిల్లా నాయకులు కూరాకుల అంజయ్య,1104 సబ్ డివిజన్ అధ్యక్షులు గోడిశాల వెంకన్న సబ్ ఇంజనీర్ వేణు ఎస్సీ ఎస్టీ ఉద్యోగ నాయకులు బద్దుల శివ, బాకీ శ్రీనివాస్, ఉద్యోగులు భాస్కర్, పురుగుల శ్రీను, సురేష్, కిరణ్ లు జయంతి వేడుకలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఏడీఈ మాట్లాడుతు ఇవ్వాల దళిత ఉద్యోగులు మంచి స్థాయి లో ఉద్యోగ పలాలు పండుతున్నారు అంటే దానికి కారణం డాక్టర్" బిఆర్ అంబెడ్కర్ కారణం కాబ్బట్టి ఆయన స్ఫూర్తి నీ కొనసాగించాలి అలాగే అంబెడ్కర్ ను ఒక్క వర్గం వారి ఆపాదించొద్దు అందరివాడు అంబెడ్కర్ అని అన్నారు